గత నెల రోజులుగా అసోంలో తీవ్ర వరదల కారణంగా ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. చాలా మంది ప్రజల మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయి. రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. పంటలు నాశసమయ్యాయి. పశువులు కూడా భారీగా చనిపోయాయి. వరదల కారణంగా వందలాది మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలో ఓ కుటుంబం పరిస్థతి ఇలా ఉంది. అస్సాం రాష్ట్రానికి చెందిన జుబ్బర్ అలీ (39) తన ఇద్దరు కుమార్తెలు, భార్య, అనారోగ్యంతో ఉన్న తల్లితో సహా అస్సాంలోని బార్‌పేట జిల్లాలో నివసిస్తున్నారు. వరదలు, నది కోత కారణంగా వారి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం వారు నది కట్టపై ఆశ్రయం పొందుతున్నారు.
READ MORE: Malvi Malhotra: రాజ్ తరుణ్ తో నా రిలేషన్ ఇదే.. ఎన్టీవీతో మాల్వి బయట పెట్టిన నిజం ఇదే!
నెల రోజుల క్రితమే జుబ్బార్, అతని కుటుంబం శాశ్వత ఇంట్లో నివసించారు. అయితే.. అతని ఇల్లు బ్రహ్మపుత్ర నది తెగి.. వరద నీరు అతడి కుటుంబాన్ని నిరాశ్రయులను చేసింది. వారి ఇళ్లు మునిగి పోయాక వాళ్లు ఓ గ్రామస్థుని ఇంట్లో తలదాచుకున్నారు. కానీ ఆ వరద నీరు ఆ ఇంటిని కూడా ముంచేసింది. దీంతో ఆ ఇరు కుటుంబాలు ఇప్పుడు బార్‌పేట జిల్లాలోని చెంగా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రౌమారి పత్తర్ ప్రాంతంలో కట్టపై తాత్కాలిక టెంట్ వేసుకుని నివసిస్తున్నారు. 1-2 నెలల్లోనే సుమారు 100 కుటుంబాలు కోతకు గురై ఇళ్లు కోల్పోయాయని, ప్రస్తుతం సహాయక శిబిరాల్లో లేదా ఇతర సురక్షిత ప్రదేశాల్లో నివసిస్తున్నారని జుబ్బర్ అలీ తెలిపారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.