Site icon NTV Telugu

Coimbatore Court: ఓ వ్యక్తికి 383 ఏళ్ల జైలుశిక్ష.. ఏం నేరం చేశారంటే..!

Coiam Battor

Coiam Battor

తమిళనాడులోని కోయంబత్తూరు కోర్టు ఓ వ్యక్తికి 383 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నకిలీ పత్రాలను సృష్టించి, మోసం చేసిన కేసులో ఈ తీర్పును వెలువరించింది. అంతేకాకుండా అతనికి రూ.3.32 కోట్ల ఫైన్ వేస్తూ సంచలన తీర్పును ఇచ్చింది.

Etela Rajender : నా జీవితం తెరిచిన పుస్తకం.. మీ ప్రేమను నా గుండెల్లో పెట్టుకుంటా.. మీకు ఏం చేయాలో మర్చిపోను

అసలు కేసు ఏంటంటే.. తమిళనాడు ఆర్టీసీ కోయంబత్తూర్ డివిజన్ లో బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయంటూ.. 1988 నవంబర్ 9న కేసు నమోదయింది. ఫేక్ డాక్యుమెంట్స్ తో 47 బస్సులను విక్రయించి రూ. 28 లక్షలు మోసం చేశారంటూ 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వారిని అరెస్ట్ చేయగా.. అప్పటి నుంచి కోర్టులో కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. అందులో ఇప్పటికే కొందరు చనిపోయారు.

Vande Bharat Express: ‘వందే భారత్’ వేగంలో మార్పులు.. ఇకపై ఎంత వేగంతో అంటే..!

మరోవైపు.. బతికున్న వారిలో కోదండపాణి అనే వ్యక్తి మినహా మిగిలిన ముగ్గురునీ జడ్జి నిర్దోషులుగా తేల్చారు. దీంతో ఆర్టీసీని మోసం చేసినందుకు కోదండపాణికి 47 నేరాల కింద నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, 47 ఫోర్జరీ నేరాలకు నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, ప్రభుత్వ ఆస్తులను కాజేసినందుకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షలనంటిని కలిపితే మొత్తం 383 సంవత్సరాల శిక్ష అవుతుంది. అయితే ప్రస్తుతం కోదండపాణి వయసు 82 సంవత్సరాలు ఉంది. దీంతో.. ఏడేళ్ల జైలు శిక్షను ఏకకాలంలో అనుభవించాలని జడ్జి తీర్పును వెలువరించారు. ఈ నేపథ్యంలో కోదండపాణిని పోలీసులు జైలుకు తరలించారు.

Exit mobile version