NTV Telugu Site icon

CM Revanth Reddy: కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఆగ్రహం..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో భేటీ గంటకు పైగా కొనసాగుతుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీపై అధికారులతో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా.. సీఎం రేవంత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం సీరియస్ అయ్యారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచినా ఇలాంటి ఘటనలు జరగడం ప్రభుత్వంకు చెడ్డపేరు తెస్తున్నాయని సీఎం అన్నారు. కలెక్టర్లు విజిట్ చేయకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణం అవుతున్నాయని తెలిపారు. ఇక నుంచి ప్రతీ వారం ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలో కలెక్టర్లు విజిట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.

Read Also: Kerala: ఐఏఎస్ హిందూ-ముస్లిం వాట్సప్ గ్రూప్‌పై దుమారం.. కేరళ ప్రభుత్వం ఏం చేసిందంటే..!

మరోవైపు.. సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారుల వరకు చేరాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేర్చే బాధ్యత కలెక్టర్లదేనన్నారు. ప్రభుత్వంకు మంచి పేరు రావాలన్నా.. చెడ్డపేరు రావాలన్నా.. కలెక్టర్ల పనితీరు పైనే ఆధారపడి ఉందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పారదర్శకంగా జరగాలి.. కొంతమంది కలెక్టర్లు అసలు ఫీల్డ్ విజిట్ చేయడం లేదని సీఎం చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కూడా సరిగ్గా మానిటర్ చేయలేదు.. అలా అలసత్వంతో ఉన్న కలెక్టర్లపై వేటు తప్పదని హెచ్చరించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌కి ‘‘జాక్‌పాట్’’ తగిలింది.. సింధునదిలో భారీగా బంగారు నిల్వలు..

Show comments