Central Government: ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులను కేంద్ర సర్కార్ మరోసారి చర్చలకు పిలిచింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని రైతు సంఘాలకు సూచన చేసింది. రాజకీయ పార్టీలతో కలిసి తప్పుదారి పట్టొద్దని రైతులను మోడీ సర్కార్ కోరింది. అయితే, నిన్నటి నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోనే రైతులు నిరసనను కొనసాగిస్తున్నారు. దేశ రాజధానిలోకి రావాలని చూసిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ మోహరించి అడ్డుకుంటున్నారు. రైతులను నియంత్రించేందుకు పలు చోట్ల టియర్ గ్యాస్ కూడా ఉపయోగించారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని కోరుతూ రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది.
Delhi: రైతులను మరోసారి చర్చలకు పిలిచిన కేంద్ర ప్రభుత్వం..
Show comments