NTV Telugu Site icon

Central Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. క్లాసికల్ లాంగ్వేజెస్ గా మరో ఐదు భాషలు

Central Cabinet

Central Cabinet

కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచేందుకు, ఫుడ్ సెక్యూరిటీ కోసం పీఎం రాష్ట్ర వికాస్ యోజన తోపాటు కృషోన్నతి యోజన కోసం రూ.1,01,321 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపింది. రైతుల ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అక్కడి పంటలకు అనుగుణంగా నిర్ణయాలు జరగాలని క్యాబినెట్ లో ప్రధాని పేర్కొన్నారు. ఫుడ్ సెక్యూరిటీతో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. చెన్నై మెట్రో సెకండ్ పేజ్ కు కూడా కేంద్ర క్యాబినెట్ జై కొట్టింది. రూ. 63,246 కోట్ల రూపాయలతో చెన్నై పేజ్ 2 మెట్రో పనులు ప్రారంభించనున్నారు. 119 కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. మూడు కారిడార్లలో 120 స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

READ MORE: Cricket: దశాబ్దం తర్వాత విజయం.. బంగ్లాదేశ్ మహిళల జట్టు భావోద్వేగం

క్లాసికల్ లాంగ్వేజెస్ గా మరో ఐదు భాషలకు కూడా ఆమోదం దక్కింది. మరాఠీ, పాళీ, ప్రక్రిత్, అస్సామీస్, బెంగాల్, భాషలను క్లాసికల్ లాంగ్వేజెస్ గా గుర్తింపు లభించనుంది. క్లాసికల్ లాంగ్వేజెస్ ని ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని మోడీ తెలిపారు. ఫోర్ట్ ఉద్యోగుల కోసం ప్రోడక్టివిటీ లింక్ రివార్డ్‌తో 20,704 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. రూ.198 కోట్ల పీఎల్‌ఆర్‌ కోసం ఖర్చు చేసేందుకు ఆమోదం లభించింది. రైల్వే ఉద్యోగులకు రూ. 2029 కోట్ల తో ప్రోడక్టివిటీ లింక్డ్ బోనస్ ను ప్రకటించింది. దీంతో 11,72,240 కోట్ల రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

Show comments