NTV Telugu Site icon

Delhi: నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ను ప్రకటించిన కేంద్రం.. షమీకి అర్జున అవార్డు

Awards

Awards

2023 సంవత్సరానికి గానూ నేషనల్ స్పోర్ట్స్ అవార్డులు ప్రకటించింది కేంద్రం. ఇండియాలో క్రీడా రంగంలో అతిపెద్ద పురస్కారం ‘ఖేల్ రత్న’కు ఇద్దరు బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎంపికయ్యారు. సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టికి ఈ అవార్డును ప్రకటించారు. ఇక.. 26 మందికి అర్జున అవార్డ్స్ ను ప్రకటించింది కేంద్రం. అందులో క్రికెటర్ మహమ్మద్ షమీకి అర్జున అవార్డు లభించింది. ఈ జాబితాలో పారా ఆర్చర్ శీతల్ దేవి పేరు కూడా ఉంది. అంతేకాకుండా.. ఏపీకి చెందిన టీమిండియా అంధుల క్రికెట్ కెప్టెన్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి కూడా అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. పవన్ కుమార్ (కబడ్డీ), సునీల్ కుమార్ (రెజ్లింగ్), వైశాలి (చెస్) అవార్డుకు ఎంపికయ్యారు. త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.

Read Also: Maheshwar Reddy: అప్పులు చేయొద్దు, ప్రజలపై భారం మోపొద్దు.. ప్రభుత్వానికి సూచన

కాగా.. సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా బ్యాడ్మింటన్‌లో భారత జెండాను ఎగురవేశారు. హాంగ్‌జౌ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో ఈ జోడీ భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించింది. మరోవైపు.. 2023 ప్రపంచకప్‌లో మహమ్మద్ షమీ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

Read Also: Kangana Ranaut : ప్రత్యక్ష రాజకీయాలలోకి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్..క్లారిటీ ఇచ్చిన కంగనా తండ్రి అమర్‌దీప్‌..

Show comments