సాయంత్రం 5 గంటలకు ఎంప్లాయిస్ అసోసియేషన్తో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. జీవో 317, జీవో 46కు సంబంధించిన సమస్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఇటీవల MCRHRDలో ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చల్లో 317, 46 జీవోలపై అధ్యానం చేయాలని సూచించారు. ఈ క్రమంలో.. దానికి సంబంధించిన సిఫార్సులతో కేబినెట్ సబ్ కమిటీతో చర్చలకు రావాలని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలకు సూచించారు.
Read Also: Minister Seethakka: రవీంద్ర భారతిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.. స్టెప్పులేసిన మంత్రి
ఈ భేటీలో ఎడ్యుకేషన్, హోమ్, హెచ్ఎం అండ్ ఎఫ్ డబ్ల్యూ విభాగాల వివరాలతో ప్రిన్సిపల్ సెక్రటరీలకు వివరాలతో రావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించిన జీవో 317. జనాభా ప్రాతిపదికన జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించిన జీవో 46 వల్ల పోలీసు రిక్రూట్మెంట్లో 53% హైదరాబాద్ జిల్లాకి రిజర్వేషన్ మిగిలిన జిల్లాలకు 47% కేటాయించడం వల్ల అభ్యంతరాలపై చర్చించనుంది కమిటీ.
Read Also: Ponnam Prabhakar: రేపటి నుండి టీజీ పేరుతో వాహన రిజిస్ట్రేషన్..
గతంలో జరిగిన సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండు జీవోల వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అధికారులు మంత్రులకు వివరించారు. దీంతో మరోసారి సమావేశానికి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఉద్యోగులు, తమ అభిప్రాయాలు కమిటీకి చెప్పుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే నేడు సబ్ కమిటీ మరో సారి భేటీ కానుంది.