NTV Telugu Site icon

Viral Video : ‘కుర్చీ మడత పెట్టి ‘ సాంగ్ కు పెళ్లి కూతురు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్..

Pellikuthuru

Pellikuthuru

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు ప్రేక్షకుల మన్ననలను అందుకుంటే, మరికొన్ని వీడియోలు విమర్శలు అందుకుంటాయి.. ఈ మధ్య పెళ్లికి సంబందించిన డ్యాన్స్ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు డ్యాన్స్ లు ఎక్కువగా హైలెట్ అవుతుంటాయి.. తాజాగా ఓ పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఒకప్పుడు బుల్లెట్ బండి సాంగ్ పెళ్లిళ్లకు ఎక్కువగా వినిపిస్తుంది.. అలాగే ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం లోని కుర్చీని మడత పెట్టి సాంగ్ ఎక్కువగా వినిపిస్తుంది.. ‘కూర్చీ మడత పెట్టి’ అనే పాటకు పెళ్లి కూతురు స్టేజీపై డాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్‌ వేయడంపై పలువురు నెటిజన్లు మెచ్చుకోని కామెంట్స్ చేస్తున్నారు.. మరోవైపు ఇలాంటి పాటకు అందరు చూస్తుండగా డ్యాన్స్ చెయ్యడం ఏంటని అభ్యంతరం తెలుపుతున్నారు..

ఈ వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ గా మారింది.. దాన్ని చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. అసలు పెళ్ళిలో వెయ్యాల్సిన పాటేనా ఇది? అది కూడా పెళ్ళి కూతురు డ్యాన్స్ చేయడానికి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. తన పెళ్లి తన ఇష్టం వచ్చిన పాటకు డాన్స్ చేస్తాదని మరికొంత మంది నెటిజన్లు సమర్ధిస్తున్నారు.. మొత్తానికి విమర్శల, ప్రశంసలతో వీడియో ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతుంది.. ఓ లుక్ ఇటు వేసుకోండి..