Viral Video: వివాహాలలో వధువులు తరచుగా సిగ్గుపడటం మనం చూస్తూనే ఉంటాం. అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ క్లిప్‌లో వధువు డిఫరెంట్ స్టైల్ నెటిజన్లను క్లీన్ బోల్డ్ చేసింది. ఆమె ఎత్తుగడలకు వరుడు కూడా అవాక్కవడం వీడియోలో చూడవచ్చు. మాల ధరించే వంతు రాగానే వధువు వరుడి మెడలో మాల వేసే ముందు అతని బుగ్గలపై ముద్దు పెడుతుంది.
Mega Movies: నెల రోజులు వరుసగా మెగా హీరోల సినిమాలు.. అభిమానులకు పండగే!
ఈ వీడియోలో.. జయమాల కార్యక్రమం కోసం వధూవరులిద్దరూ వేదికపై ఉన్నారు. అదే సమయంలో బంధువులు వారి కార్యక్రమాన్ని వీడియో తీయడం కోసం తమ మొబైల్‌లతో రెడీగా ఉన్నారు. అయితే పెళ్లికూతురు మాత్రం అక్కడున్న వారు ఊహించని పనిని చేస్తుంది. ఆ అబ్బాయికి పూలమాల వేసే ముందు పెళ్లికూతురు అతని బుగ్గలపై ప్రేమగా ముద్దుపెట్టుకోవడం వీడియోలో చూడవచ్చు. ఈ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్నవారంతా ముక్కున వేలేసుకుంటారు.
Mrunal Thakur : పారితోషకం భారీగా పెంచేసిన మృణాల్ ఠాకూర్..?
వధువు యొక్క ఈ నిర్భయ శైలి సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో @memecentral.teb అనే ఖాతాలో వీడియో షేర్ చేశారు. యూజర్ వావ్ వాట్ ఏ సీన్ అని క్యాప్షన్ ఇచ్చారు. కొన్ని సెకన్ల క్లిప్‌పై ఇప్పటివరకు దాదాపు 6 వేల లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా ఈ వీడియోపై చాలా మంది తమ స్పందనలను క్రేజీగా తెలుపుతున్నారు.