NTV Telugu Site icon

Mohammed Shami: షమీకి పెళ్లి ప్రపోజ్.. ట్వీట్ చేసిన బాలీవుడ్ నటి

Shami

Shami

వరల్డ్ కప్ 2023లో టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో 16 వికెట్లు తీసి మంచి ఫాంలో కొనసాగుతున్నాడు. అయితే ఈ టోర్నీలో సగం మ్యాచ్ లే ఆడినప్పటికీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ప్రముఖ బాలీవుడ్ నటి మహ్మద్ షమీతో ప్రేమలో పడింది.. అంతేకాదు పెళ్లికి కూడా ప్రపోజ్ చేసింది.

Read Also: DA Hike: ఉద్యోగులకు డీఏ పెంచిన ప్రభుత్వాలు.. ఏఏ రాష్ట్రాలు ఉన్నాయంటే..!

ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపింది బాలీవుడ్ నటి పాయల్ ఘోష్.. ట్వీట్‌లో మహ్మద్ షమీపై తన ప్రేమను వ్యక్తం చేసింది. షమీ.. నువ్వు ఇంగ్లీష్‌ని మెరుగుపరుచుకో, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ పాయల్‌ ఘోష్‌ ట్వీట్‌ చేసింది. అయితే ఈ ట్వీట్ ఏ ఉద్దేశ్యంతో చేసిందనేది తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా.. నెటిజన్లు దీనిపై కామెంట్స్ చేస్తూ వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

Read Also: AICC Ajay Kumar : రాజస్థాన్ లో ఈడీ కూడా లంచం అడుగుతుంది..

ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్‌లో అద్భుత ప్రయాణం కొనసాగిస్తోంది. టీమిండియా వరుసగా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. అంతేకాకుండా.. సెమీఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా ఇండియా నిలిచింది. టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్‌ను నవంబర్ 12న నెదర్లాండ్స్‌తో ఆడనుంది.

 

Show comments