Site icon NTV Telugu

Mix Up : ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 03 15 At 4.39.24 Pm

Whatsapp Image 2024 03 15 At 4.39.24 Pm

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‍ఫామ్స్ కు ఆదరణ బాగా లభిస్తుండటంతో ప్రేక్షకుల కోసం పలు ఓటీటీ సంస్థలు రకరకాల కంటెంట్‍తో సినిమాలు మరియు వెబ్ సిరీస్‍లు తీసుకువస్తున్నాయి. అయితే ఓటీటీకి సెన్సార్ నిబంధన లేకపోవడంతో బోల్డ్ సబ్జెక్టుతో ఉన్న కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలోకే అడుగుపెడుతున్నాయి.ఈ క్రమంలోనే ‘మిక్స్ ఆప్’ మూవీ థియేటర్లలోకి రాకుండానే నేరుగా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు మరియు పూజా జావేరి కీలకపాత్రలు పోషించారు.’మిక్స్ అప్’ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (మార్చి 15) స్ట్రీమింగ్‍కు వచ్చింది. ట్రైలర్ తర్వాత ఈ చిత్రానికి మంచి బజ్ వచ్చింది. రెండు జంటల రిలేషన్‍కు సంబంధించిన స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కింది.

ఆ రెండు జంటలు తమ శృంగార జీవితం గురించి చెప్పే ట్రైలర్‌తో ఈ న్యూఏజ్ బోల్డ్ కంటెంట్ సినిమాపై ఆసక్తి పెరిగింది.కామంపై ప్రేమ గెలుస్తుందా..? అంటూ ‘మిక్స్ ఆప్’ సినిమాకు ఆన్‍లైన్‍లో బాగానే ప్రమోషన్స్ చేసింది ఆహా ఓటీటీ. మొత్తానికి నేడు (మార్చి 15) ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులో వచ్చింది.మిక్స్ అప్ చిత్రానికి ఆకాశ్ బిక్కీ దర్శకత్వం వహించారు. హైమా వర్షిణి కథ అందించారు. తిరుమల్ రెడ్డి అమిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కౌశిక్ సంగీతం అందించారు.ఆదర్శ్ – అక్షర గౌడ, కమల్ కామరాజ్ – పూజా.. ఈ చిత్రంలో పెళ్లయిన రెండు జంటలుగా నటించారు. శృంగారపరంగా వారి మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. దీంతో ఆ దంపతుల మధ్య రిలేషన్ దెబ్బ తింటుంది.ఈ విషయంపై వారు ఓ స్పెషలిస్ట్ దగ్గరికి వెళతారు. దీంతో విడిపోయేందుకు తొందరపడకుండా కొంత సమయం తీసుకోవాలని ఆ రెండు జంటలకు ఆమె సూచిస్తారు. ఆ తర్వాత ఆ నలుగురి మధ్య అనూహ్య విషయాలు జరుగుతాయి.ఆ తర్వాత ఏం జరిగింది..? ఆ రెండు జంటలు కలిసే ఉన్నాయా..? విడిపోయారా అనేదే మిక్స్ అప్ ప్రధాన కథ.

Exit mobile version