Mix Up : ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‍ఫామ్స్ కు ఆదరణ బాగా లభిస్తుండటంతో ప్రేక్షకుల కోసం పలు ఓటీటీ సంస్థలు రకరకాల కంటెంట్‍తో సినిమాలు మరియు వెబ్ సిరీస్‍లు తీసుకువస్తున్నాయి. అయితే ఓటీటీకి సెన్సార్ నిబంధన లేకపోవడంతో బోల్డ్ సబ్జెక్టుతో ఉన్న కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలోకే అడుగుపెడుతున్నాయి.ఈ క్రమంలోనే ‘మిక్స్ ఆప్’ మూవీ థియేటర్లలోకి రాకుండానే నేరుగా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు మరియు పూజా జావేరి కీలకపాత్రలు పోషించారు.’మిక్స్ అప్’ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (మార్చి 15) స్ట్రీమింగ్‍కు వచ్చింది. ట్రైలర్ తర్వాత ఈ చిత్రానికి మంచి బజ్ వచ్చింది. రెండు జంటల రిలేషన్‍కు సంబంధించిన స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కింది.
ఆ రెండు జంటలు తమ శృంగార జీవితం గురించి చెప్పే ట్రైలర్‌తో ఈ న్యూఏజ్ బోల్డ్ కంటెంట్ సినిమాపై ఆసక్తి పెరిగింది.కామంపై ప్రేమ గెలుస్తుందా..? అంటూ ‘మిక్స్ ఆప్’ సినిమాకు ఆన్‍లైన్‍లో బాగానే ప్రమోషన్స్ చేసింది ఆహా ఓటీటీ. మొత్తానికి నేడు (మార్చి 15) ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులో వచ్చింది.మిక్స్ అప్ చిత్రానికి ఆకాశ్ బిక్కీ దర్శకత్వం వహించారు. హైమా వర్షిణి కథ అందించారు. తిరుమల్ రెడ్డి అమిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కౌశిక్ సంగీతం అందించారు.ఆదర్శ్ – అక్షర గౌడ, కమల్ కామరాజ్ – పూజా.. ఈ చిత్రంలో పెళ్లయిన రెండు జంటలుగా నటించారు. శృంగారపరంగా వారి మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. దీంతో ఆ దంపతుల మధ్య రిలేషన్ దెబ్బ తింటుంది.ఈ విషయంపై వారు ఓ స్పెషలిస్ట్ దగ్గరికి వెళతారు. దీంతో విడిపోయేందుకు తొందరపడకుండా కొంత సమయం తీసుకోవాలని ఆ రెండు జంటలకు ఆమె సూచిస్తారు. ఆ తర్వాత ఆ నలుగురి మధ్య అనూహ్య విషయాలు జరుగుతాయి.ఆ తర్వాత ఏం జరిగింది..? ఆ రెండు జంటలు కలిసే ఉన్నాయా..? విడిపోయారా అనేదే మిక్స్ అప్ ప్రధాన కథ.
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి