NTV Telugu Site icon

Gandhinagar: మూడు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంలో బీజేపీ ఎదురు లేదు..

Amith Shah

Amith Shah

ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ లో గాంధీనగర్ నియోజకవర్గాన్ని బీజేపీ కంచుకోటగా పరిగణిస్తారు. 34 నాలుగేళ్లుగా ఆ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేసింది. అటల్ బిభారీ వాజ్ పేయి, అధ్వాణి వంటి బీజేపీ కీలక నేతలు ఈ నియోజకవర్గం నుంచే గెలుపొందారు. 1989 నుంచి ఈ సీటును బీజేపీ కైవసం చేసుకుంటోంది. కాంగ్రెస్ తరఫున ఎంత మంది మహా నేతలు బరిలోకి దిగిన ఫలితం లేకుండా పోతోంది. గతంలో టీఎన్ శేషన్, రాజేఫ్ ఖన్నాలు సైతం ఓటమిపాలయ్యారు. ఈ సారి కూడా గాంధీ నగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ గుజరాత్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేస్తున్న సోనాల్ పటేల్ పోటీ చేస్తున్నారు.

READ MORE: Sunita Williams Space Mission: సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర వాయిదా, కారణం ఏమిటంటే?

గత ఎన్నికల్లో ఐదున్నర లక్షల తేడాతో అమిత్ షా విజయ కేతనం ఎగురవేశారు. ఈ సారి మెజార్టీ పెరుగుతుందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. కాగా.. గాంధీ నగర్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి గాంధీనగర్ నార్త్, కలోల్, సనంద్, ఘట్లోడియా, వేజల్పూర్, నారన్ పురా, సబర్మతి. ఈ మొత్తం స్థానాలను గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. 1999 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన టీఎన్ శేషన్ కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. అతని ప్రత్యర్థిగా అధ్వాణి పోటీలో ఉన్నారు. అధ్వాణికి గట్టి పోటీ ఇవ్వగలిగాడే తప్ప.. విజయం సాధించలేకపోయారు..శేషన్. అప్పటి నుంచి ఆ సీటు కాషాయ మయంగానే ఉంది. 1996 లో వాజ్ పేయి ఈ స్థానంతో పాటు లక్నో నుంచి కూడా బరిలోకి దిగారు. ఈ రెండు స్థానాల్లో విజయం సాధించడంతో గాంధీనగర్ లో రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయ్ పటేల్ పై బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఖన్నా ఓటమి పాలయ్యారు. ఈ సారి మాత్రం అమిత్ షా దాదాపు 10 లక్షల ఓట్ల మెజార్టీ సాధిస్తారని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది.