NTV Telugu Site icon

Jay Shah: క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన జై షా..

Jay Shah

Jay Shah

ఇటీవలే పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసింది. ఈసారి భారతదేశం నుంచి 117 మంది అథ్లెట్ల బృందం పాల్గొనగా.. అందులో దేశానికి 1 రజతం, 5 కాంస్య పతకాలు మాత్రమే వచ్చాయి. అయితే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెక్రటరీ జై షా క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఎ) సిద్ధమవుతుందని.. ఇందులో క్రికెటర్లతో పాటు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సహా ఇతర అథ్లెట్లు కూడా ప్రాక్టీస్ చేయగలరని ఆయన చెప్పారు. వారికి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

READ MORE: గ్లామర్ డోస్ పెంచేసిన ప్రగ్యా జైస్వాల్..

భారత అథ్లెట్లను ఆదుకునేందుకు బీసీసీఐ ఎప్పుడూ ముందుంటుందని జై షా అన్నారు. ‘నీరజ్ చోప్రా వంటి ఒలింపిక్ ప్లేయర్‌లకు కూడా దీన్ని అందుబాటులో ఉంచబోతున్నాం’ అని బీసీసీఐ కార్యదర్శి ఓ జాతీయ మీడియా సంస్థకి తెలిపారు. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) బెంగళూరులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నగరంలో కొత్త ఎన్ సీఈ కూడా దాదాపు పూర్తయింది. వచ్చే నెలలో దీనిని ప్రారంభించనున్నారు. బీసీసీఐ యొక్క అతిపెద్ద ప్రాజెక్ట్‌లలో హై పెర్ఫార్మెన్స్ సెంటర్ కూడా ఒకటి. ఇటీవల జై షా నీరజ్ చోప్రాను కలిశారు. అప్పుడు బీసీసీఐ కార్యదర్శి డబుల్ ఒలింపిక్ పతక విజేత నీరజ్‌తో మాట్లాడుతూ.. క్రికెటర్లు కానివారికి కూడా అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు జే షా తన వాగ్దానాన్ని నెరవేర్చారు.

READ MORE: గ్లామర్ డోస్ పెంచేసిన ప్రగ్యా జైస్వాల్..

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘నేను అక్టోబర్ 2019 లో బాధ్యతలు స్వీకరించాను. కరోనా కారణంగా 2 సంవత్సరాలు కార్యాలయం మూతపడి ఉంది. సెకండ్ వేవ్ అప్పుడు (2022లో) వచ్చినప్పుడు.. ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. నా మొదటి పదవీ కాలంలోనే ఈ ప్రాజెక్టుకు పునాది పడినందుకు సంతోషిస్తున్నను.” అని తెలిపారు.