NTV Telugu Site icon

CSK vs MI : రెండూ పెద్ద టీంలు.. హోరా హోరీ పోరు.. గెలుపు ఎవరిది?

Csk Vs Mi

Csk Vs Mi

ఐపీఎల్ 2025 మూడవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ముంబై ఇండియన్స్ జట్టు సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉంటుంది. గత ఐపీఎల్ సీజన్‌లో మూడోసారి స్లో ఓవర్ రేట్‌ను ఉల్లంఘించినందుకు ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. ఈ నిషేధం కారణంగా, హార్దిక్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మొదటి మ్యాచ్ ఆడలేడు. మరోవైపు.. రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని నిర్వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ కు సంబంధించిన వివరాలను ఒకసారి పరిశీలిస్తే…

READ MORE: Manchu Lakshmi : నిజాన్ని దాచలేరు.. వాళ్లు క్షమాపణలు చెప్పాల్సిందేః మంచు లక్ష్మీ

ఐపీఎల్ చరిత్రలో చెన్నైపై ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఈ రెండు జట్లు 37 మ్యాచ్‌లు ఆడగా చెన్నై 17 మాత్రమే గెలవగా, ముంబై ఇండియన్స్ 20 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 2012 తర్వాత ముంబై ఇండియన్స్ తాను ఆడిన తొలి మ్యాచ్‌లో ఇప్పటి వరకూ గెలవలేదు. సీఎస్కేపైనే ఎక్కువగా ఓడిపోయింది. మరి ఈ ఏడాది జరిగే మ్యాచ్‌లో ఏవిధంగా రాణిస్తుందో చూడాలి.

READ MORE:Manchu Lakshmi : నిజాన్ని దాచలేరు.. వాళ్లు క్షమాపణలు చెప్పాల్సిందేః మంచు లక్ష్మీ

కెప్టెన్‌గా రికార్డు..
హార్దిక్ పాండ్యా (MI): 14 మ్యాచ్‌లు, 4 విజయాలు, 10 ఓటములు
సూర్యకుమార్ యాదవ్ (MI): 1 మ్యాచ్, 1 విజయం, 0 ఓటమి
రుతురాజ్ గైక్వాడ్ (CSK): 14 మ్యాచ్‌లు, 7 విజయాలు, 7 ఓటములు