ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రగతి వైపు అడుగులు వేస్తోంది. గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ, రాజధాని అమరావతిలో అసంపూర్తి నిర్మాణాల పూర్తికి చర్యలు, రాజధాని నిర్మాణం పై ప్రణాళికలు సిద్ధం చేయడం, ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేయించి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎప్పుడు ఎక్కడనుంచి తిరిగి ప్రారంభించాలనే అంశాలను చాలా కీలకంగా తీసుకుంది ప్రభుత్వం. ఈ క్రమంలో మరో ముందడుగు వేసింది.
Read Also: Minister Narayana: మునిసిపాలిటీలలో ఇంటింటికి తాగునీరు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాం..
పరిపాలనను పరుగులు పెట్టించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను విభజించి పరిష్కారంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొత్తంగా 49 విభాగాల్లో ఆర్థికేతర సమస్యలను అధికారులు గుర్తించారు. వివిధ అంశాలపై మొత్తంగా 24 పాలసీలు రూపొందించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. రాష్ట్రాభివృద్ధి, విజన్ డాక్యుమెంట్లు, గ్రోత్ పాలసీలో భాగంగా విధాన పత్రాల రూపకల్పన చేస్తోంది. ఆర్థికేతర అంశాల పరిష్కారంపై తీసుకోవాల్సిన చర్యలు, పాలసీల రూపకల్పనపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ శాఖలకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 30వ తేదీలోగా పరిష్కారంపై తీసుకున్న చర్యల వివరాలు.. పాలసీల రూపకల్పన వివరాలను అందివ్వాలని సీఎస్ సూచించారు. వచ్చే కేబినెట్ భేటీలో ఆర్థికేతర అంశాల పరిష్కారం, పాలసీల రూపకల్పనపై చర్చ ఉంటుందని సీఎస్ వెల్లడించారు.
Read Also: Stock market: మళ్లీ ఒడిదుడుకులు.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్