NTV Telugu Site icon

DCP Koti Reddy : గాజుల రామారంలో కాల్పులు జరిపిన నిందితులు అరెస్ట్‌

Dcp Kotireddy

Dcp Kotireddy

రెండు రోజుల క్రితం గాజుల రామారంలో కాల్పులు జరిపిన నిందితులను 48 గంటలలో పట్టుకొని మీడియా ముందు హాజరుపరిచారు పోలీసులు.. 27 తారీఖు అర్థరాత్రి గాజుల రామా రం LN బార్ దగ్గర పెట్రోల్ దొంగలిస్తూ జరిగిన గొడవలో ముఖ్య నిందితుడు నరేష్ ఆదేశాలతో అనుచరుడు శివ కంట్రీమేడ్ తుపాకీతో బార్ సిబ్బందిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి తార్ వాహనంతో గుద్ది చంపాలని ప్రయత్నించడం బార్ సిబ్బంది గాయాలతో తప్పించు కొని పోలీసులకు ఫిర్యాదు చేసారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు నరేష్ తో పాటు మరో 14 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీ, 87 రౌండ్ల బుల్లెట్లు , 3కార్లు, ఒక ద్వి చక్ర వాహనం స్వాధీన పరుచుకున్నట్లు మేడ్చల్‌ జోన్‌ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.

Himanta Biswa Sarma: అసెంబ్లీలో 2 గంటల నమాజ్ బ్రేక్ రద్దు.. అస్సాం సీఎం సంచలన నిర్ణయం..

కాల్పుల్లో ఉపయోగించిన దేశావాళీ తుపాకి, 100 బులెట్స్ ను బీహార్ నుండి తెప్పించి బార్ సిబ్బందిపై రెండు రౌడ్స్ కాల్పులు జరపగా మరో 11 బులెట్స్ ఓఆర్‌ఆర్‌ దగ్గర గన్ ప్రాక్టీస్ చేసినట్లు గా పోలీసుల విచారణలో తేలింది.. నిందితుడు నరేష్ పై దుండిగల్ పియస్ లో 4 సంగారెడ్డి పియస్ లో 1 కేసులు ఉన్నాయని ఇంకా అతని నేర చరిత్రను విచారించాల్సి ఉందని డీసీపీ కోటి రెడ్డి అన్నారు.. చిన్న విషయానికి నరేష్ తన అనుచరులతో రౌడీయిజమ్ చేయడాన్ని సీరియస్ గా తీసుకుంటామని గన్ కల్చర్ ను సహించబోమని, పలు ల్యాండ్ సెటిల్మెంట్ ల లో నరేష్ సూత్ర దారిగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాడని అన్నారు. నరేష్ పై రౌడీ షీట్ తో పాటు అతని అనుచరులు 14 మందిని,వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు..

NASA: సునీతా విలియమ్స్ లేకుండా సెప్టెంబర్ 6 తర్వాత భూమిపైకి స్టార్‌లైనర్..