కరోనా నేపథ్యంలో గత మూడు సీజన్ లు పలు ఆంక్షల మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) టీ20 క్రికెట్ టోర్నీక మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. ఈ సంవత్సరం ఎలాంటి ఆంక్షలు లేకుండా అభిమానులకు పూర్తి స్థాయిలో వేసవిలో పరుగుల విందు అందించడానికి ఐపీఎల్ జట్లు సిద్దమయ్యాయి. రేపు ( శుక్రవారం ) అహ్మదాబాద్ లో ఢిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ తో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కాబోతుంది.
Also Read : Gang War in Old City: రచ్చకు దారితీసి క్రికెట్ ఆట.. బాల్ ఇంట్లోకి వెళ్లిందని గ్యాంగ్ వార్
ఈ ఐపీఎల్ టోర్నీ మొత్తం 10 జట్ల మధ్య 12 నగరాల్లో 74 మ్యాచ్ లు రెండు నెలల పాటు జరుగనున్నాయి. లీగ్ దశలో 70 మ్యాచ్ లు ఉండగా.. ప్లే ఆఫ్ దశలో నాలుగు మ్యాచ్ లతో ( క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్ ) టోర్నీ ముగుస్తుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు జైపూర్ తో పాటు గువాహటిలో.. పంజాబ్ కింగ్స్ జట్టు మొహాలితో పాటు ధర్మశాలలో కూడా మ్యాచ్ లు జరగనున్నాయి. కరోనా కంటే ముందు ఐపీఉఎల్ లో ఇంటా, బయటా పద్దతిలో ఆయా ఫ్రాంఛైజీల మధ్య మ్యాచ్ లు జరిగేవి.. కరోణా కరణంగా ఈ పద్దతికి విరామం ఇచ్చారు.. ఇప్పుడు అంతా బాగుండటంతో నిర్వహకులు మళ్లీ పాత పద్దతిలో ఐపీఎల్ నిర్వహించనున్నారు.
Also Read : Arvind Kejriwal: దొంగలు, అవినీతిపరులు అందరూ ఒకే పార్టీలో ఉన్నారు..
అయితే ప్లే ఆఫ్ ( క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 ) మూడు మ్యాచ్ లకు సంబంధించిన తేదీలను, వేదికలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ వేదికను కూడా తొందరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఐపీఎల్ కోసం క్రికెట్ ప్రేక్షకులు ఎంతో ఆతురతగా వేచి చూస్తున్నారు.
