NTV Telugu Site icon

IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో టీమిండియా

Ind Vs Aus

Ind Vs Aus

IND vs AUS: బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2024-25 లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్‌ పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. తొలి ఇన్నింగ్స్ తొలిరోజు 150 పరుగులకే పరిమితమైన భారత్, ఆ తర్వాత ఆస్ట్రేలియాను 67 పరుగులకే 7 వికెట్లను పడగొట్టింది. ఇక నేటి రెండో రోజులో భారత్ ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. 67 పరుగుల వద్ద రెండో రోజును మొదలు పెట్టిన ఆస్ట్రేలియా 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దింతో టీమిండియాకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి ఆస్ట్రేలియాను చావు దెబ్బ తీసాడు. జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న హర్షిత్ రాణా 3 వికెట్లు, హైదరాబాదీ బౌలర్ సిరాజ్ 2 వికెట్లు తీసుకున్నారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో మిట్చెల్ స్టార్క్ 26 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

Also Read: IND vs AUS: 21ఏళ్ల తర్వాత ఆ పని చేసిన యశస్వి జైస్వాల్ – కేఎల్ రాహుల్ జోడి

ఇక స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆస్ట్రేలియా బౌలర్లు టీమిండియా బ్యాట్స్మెన్స్ ను పలు ఇబ్బందులకు గురిచేసిన ఎంతో ఓపికగా ఇద్దరు బ్యాటింగ్ చేస్తూ రోజు ముగిసే సమయానికి వికెట్ పడకుండా 172 పరుగులను జోడించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేఎల్ రాహుల్ 62 పరుగులు, యశస్వి జైస్వాల్ 90 పరుగులతో అజేయంగా నిలిచారు. దీంతో టీం ఇండియా రెండో రోజు ఆటో ముగిసే సమయానికి 218 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ జోడి పలు రికార్డులను నెలకొల్పింది. ఇకపోతే అప్టస్ స్టేడియంలో అతి పిన్న వయసుడిగా హాఫ్ సెంచరీ చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు యశస్వి జైస్వాల్. ఇదివరకు ఈ రికార్డు ట్రావిస్ హెడ్ పేరు మీద ఉండేది.