Site icon NTV Telugu

Thatikonda Rajaiah : ఇంటి దొంగలే షికండి పాత్ర పోషిస్తున్నారు

Thatikonda Rajaiah

Thatikonda Rajaiah

తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్రంగా ఖండించారు. ఇంటి దొంగలే శిఖండిలా మారి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయనే తనపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. జరిగిన విషయాలన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్ని విషయాలను వివరిస్తానని ఆయన అన్నారు. అయితే ఇదిలా ఉంటే.. తాటికొండ రాజయ్యపై ఓ మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్ చేసిన అసభ్యంగా మాట్లాడుతున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని తెలిపింది. అంతేకాకుండా.. అతని అనుచరులతో కూడా ఫోన్లు చేయించి వేధిస్తున్నారని ఆమె వాపోయింది.

Also Read : NTR: నటుడిగా కాదు ఒక భారతీయుడిగా రెడ్ కార్పెట్ పై నడుస్తా

హన్మకొండ జిల్లా జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య చేసిన ఈ ఆరోపణలు పెను సంచలనంగా మారడంతో.. రాజయ్య ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యే రాజయ్య ఫోన్లు చేసిన అసభ్యంగా మాట్లాడుతున్నారని దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళతానని సర్పంచ్ నవ్య కన్నీటిపర్యంతమయ్యారు. ఇటువంటి నేతలతో బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వస్తోందని ఇటువంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ నవ్య డిమాండ్ చేశారు. అయితే.. సర్పంచ్‌ నవ్య వ్యాఖ్యలపై పైవిధంగా తాటికొండ రాజయ్య స్పందించారు.

Also Read : Karnataka: మరోసారి కర్ణాటకకు ప్రధాని మోదీ.. ఎన్నికల నేపథ్యంలో వరస పర్యటనలు

Exit mobile version