NTV Telugu Site icon

Thatikonda Rajaiah : స్టేషన్ ఘనపూర్‌కు నేనే సుప్రీం.. తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు

స్టేషనల్ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జనగామ జిల్లాలోని కేశవనగర్ గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ పరిస్థితులు చూస్తే నేను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేదన్నారు. నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయని, డప్పు కొట్టాలన్నా, ఫ్లెక్సీలు కట్టాలన్నా భయపడుతున్నారన్నారు. కోలాటమాడాలన్నా భయపడుతున్నారని, ఎందుకు అభద్రత భావంలో ఉన్నారో అర్దం కావట్లేదన్నారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. జనవరి 17 వరకు నేనే ఎమ్మెల్యేనని, స్టేషన్ ఘనపూర్ కు నేనే సుప్రీం అని తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు.

Also Read : Broccoli Benefits: బరువు తగ్గాలి అనుకుంటున్నారా..? అయితే ఇది తినండి

ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్యకు కోల్డ్‌ వార్‌ జరుగుతోంది. అయితే.. ఇటీవల బీఆర్‌ఎస్‌ అధిష్టానం వచ్చే ఎన్నికల కోసం 115 మంది అభ్యర్థుల జాబితాలను విడదల చేసింది. అయితే.. నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులను హోల్డ్‌లో పెట్టారు. ఇందులో ఒకటి స్టేషన్‌ ఘన్‌పూర్‌. అయితే.. ఈ స్టేషన్‌ ఘనపూర్‌ నుంచి తాటికొండ రాజయ్య కాకుండా ఈసారి కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగుతారని తెలుస్తోంది. అయితే.. ఈ క్రమంలోనే అసంతృప్తితో ఉన్న తాటికొండ రాజయ్యకు తెలంగాణ రైతుబంధు చైర్మన్‌ పదవికి కట్టబెట్టింది. అయితే.. తెలంగాణ రైతుబంధు చైర్మన్‌గా రాజయ్యను నియమించడంతో స్టేషన్‌ ఘన్‌పూర్‌ కథ సుఖాంతం అయ్యిందనుకుంటే.. ఇప్పుడు తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి.

Also Read : Viral news: ఆ ఊరిలో నైటీలు వేసుకుంటే భారీ ఫైన్ .. ఎందుకో తెలుసా?