NTV Telugu Site icon

Thatikonda Rajaiah : ఎస్సీలు మోడీని తరిమి కొట్టేందుకు సిద్దంగా ఉన్నారు

Thatikonda Rajaiah

Thatikonda Rajaiah

హన్మకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో 8న వరంగల్ లో ప్రధాని పర్యటన పైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, అరూరి రమేష్.. నన్నపనేని నరేందర్‌, తాటికొండ రాజయ్యలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఎస్సీలను మోసం చేసిందని ఆయన అన్నారు. 8న వరంగల్ కు ప్రధాన మంత్రి వస్తున్న సందర్భంగా ఎస్సీలు నిరసన తెలపాలని ఆయన అన్నారు. మోడీ వరంగల్ కు ఎందుకు వస్తున్నారని, వరంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పేందుకు వస్తున్నారా? అని ఆయన అన్నారు.

Also Read : NIA Raids: యూపీలో చిత్రకారుడి ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు.. పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నట్లు సమాచారం..!

ఎస్సీలు మోడీని తరిమి కొట్టేందుకు సిద్దంగా ఉన్నారని తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ.. 9 సంవత్సారాల పాలన తరువాత తెలంగాణ పై బీజేపీ కి ప్రేమ కలిగిందని, ఇది అసలైన ప్రేమ కాదు. ఎన్నికలు వస్తున్న సందర్భంగా పుట్టిన ప్రేమని ఆయన మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజలు నమ్మరని, ఉత్తర భారత దేశంపై ఉన్న ప్రేమ దక్షిణ భారత దేశం పై లేదన్నారు. మీరు పాలించే రాష్ట్రాలు, మీ సొంత రాష్ట్రాల్లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకునేందుకు ఉన్న ప్రేమ మా రాష్ట్రాల పై ఎందుకులేదని ఆయన ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రకటన చేసిన తరువాతే వరంగల్ ప్రధాని రావాలన్నారు.

Also Read : Kiraak RP: వాళ్లు బాలకృష్ణ మనుషులు.. రోజూ నా కర్రీ పాయింట్ కి వచ్చి