లోకనాయకుడు కమల్ హాసన్ దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ‘విక్రమ్’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఆ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు కమలహాసన్.విక్రమ్ సినిమా ప్లాప్ లతో సతమతమవుతున్న ఆయన కెరీర్ కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది..విక్రమ్ సినిమాను ఆయనే నిర్మించడం జరిగింది. సినిమా భారీ గా సక్సెస్ కావడంతో కమలహాసన్ కు భారీగా లాభాలు వచ్చాయి.దీంతో కమల్ హాసన్ వివాదాలతో ఆగిపోయిన ఇండియన్ 2 సినిమాను తిరిగి మళ్ళీ రీ స్టార్ట్ చేసాడు. కమల్ హాసన్ చేస్తున్న తరువాత సినిమా ”ఇండియన్ 2”..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మరీ మళ్ళీ మొదలైన ఈ సినిమాను అగ్ర దర్శకుడు అయిన శంకర్ తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో ఒక అతిథి పాత్ర ఉందని సమాచారం.అందుకోసం ఒక స్టార్ హీరోను తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ పాత్ర కేవలం రెండు నిముషాల పాటు ఉండబోతుందని సమాచారం.అందుకోసం ఒక స్టార్ హీరో ను తీసుకోనున్నట్లు సమాచారం.ఆ స్టార్ హీరో పాత్ర క్లైమాక్స్ కి రివీల్ చేయనున్నట్లు తెలుస్తుంది.. ఈ అతిథి పాత్ర సినిమాలో రెండు సీన్స్ లో ఉంటుందని సమాచారం. కమల్ కోసం శంకర్ ఏ స్టార్ హీరోను తీసుకు వస్తారో చూడాలి. ఇదిలా ఉండగా ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వందల కోట్ల బడ్జెట్ తో భారీగా నిర్మిస్తుంది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.. కాజల్ అగర్వాల్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ ను పూర్తి చేసారు.. ఈ ఏడాది ఆగస్టు నాటికి షూటింగ్ అంతా పూర్తి చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఎప్పుడూ విడుదల చేస్తారో మాత్రం క్లారిటీ లేదు.