NTV Telugu Site icon

AP Election Results 2024: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ సెంటిమెంట్‌ రిపీట్‌..

Kri

Kri

AP Election Results 2024: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సత్తా చాటింది.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని మట్టికరిపిస్తూ.. తిరుగులేని విజయాన్ని అందుకుంది.. కూటమి సునామీలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యింది.. ఇక, ఇదే సందర్భంలో రాష్ట్రంలోని వివిధ స్థానాల్లో సెంటిమెంట్‌ను కూడా గుర్తుచేసుకుంటున్నారు నేతలు.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరోసారి పాత సెంటిమెంట్‌ రిపీట్‌ అయ్యింది.. ఓ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన వారు.. తర్వాత ఎన్నికల్లో ఓటమి చెందుతారనే సెంటిమెంట్‌ కృష్ణా జిల్లాల్లో మరో సారి రిపీట్‌ అయ్యింది.. దానికి వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో జిల్లా నుంచి మంత్రులుగా పని చేసిన అందరూ పరాజయం చవిచూశారు.. జగన్‌ 1 కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన కొడాలి నాని మరోసారి గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమి మూఠగట్టుకోగా.. ఇక, జగన్‌ 1 కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్‌, జగన్‌ 2 కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్.. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ సూచనల మేరకు నియోజకవర్గాలు మారినా.. వారికి ఓటమి తప్పలేదు.. మరోవైపు.. మచిలీపట్నంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్‌ కూడా రిపీట్‌ అయ్యింది.

Read Also: Telangana Inter board: హిట్లర్ను మించిపోతున్న ఇంటర్ బోర్డు అధికారులపై జేఏసీ చైర్మన్ ఆరోపణలు..