Vijay Thalapathy : విజయ్ దళపతి మూవీలో ఆ సీనియర్ హీరోయిన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తరువాత సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విజయ్.దీనితో విజయ్ తరువాత సినిమా ఎలా ఉండబోతుందా అని అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలే తాను రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు విజయ్ ప్రకటించారు. దాంతో కొందరు అభిమానులు షాక్ అయ్యారు.మరికొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈసినిమా ఉంటుందని సమాచారం.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభుదేవా,ప్రశాంత్, వైభవ్ మరియు ప్రేమ్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.అలాగే ఈ మూవీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన “లైలా” ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.నటి లైలా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇప్పటికి కూడా ఆమె అదే అందంతో ఆకట్టుకుంటుంది. తెలుగు మరియు తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.రీసెంట్ గా కార్తీ హీరోగా నటించిన సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు విజయ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని క్రేజీ అప్డేట్ రానున్నాయి.
Also Read
- Arnab Cyclone Alert: దూసుకొస్తున్న 'అర్నబ్'.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
- OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
- Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
- OTR: సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?
తాజావార్తలు
-
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
-
OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
-
Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
-
OTR: సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?
-
Hyderabad: కాటేదాన్లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!