NTV Telugu Site icon

Vijay Thalapathy : విజయ్ దళపతి మూవీలో ఆ సీనియర్ హీరోయిన్..?

Whatsapp Image 2024 04 28 At 9.38.37 Am

Whatsapp Image 2024 04 28 At 9.38.37 Am

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తరువాత సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విజయ్.దీనితో విజయ్ తరువాత సినిమా ఎలా ఉండబోతుందా అని అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలే తాను రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు విజయ్ ప్రకటించారు. దాంతో కొందరు అభిమానులు షాక్ అయ్యారు.మరికొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం విజయ్ ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈసినిమా ఉంటుందని సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభుదేవా,ప్రశాంత్‌, వైభవ్‌ మరియు ప్రేమ్‌జీ  ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.అలాగే ఈ మూవీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన “లైలా” ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.నటి లైలా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇప్పటికి కూడా ఆమె అదే అందంతో ఆకట్టుకుంటుంది. తెలుగు మరియు తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.రీసెంట్ గా కార్తీ హీరోగా నటించిన సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు విజయ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని క్రేజీ అప్డేట్ రానున్నాయి.

Show comments