Site icon NTV Telugu

Aadhipurush : ఆదిపురుష్ స్ట్రీమింగ్ హక్కులు పొందిన ప్రముఖ ఓటీటీ సంస్థ..!!

Telugu Theatrical Rights Details Of Adipurush 001

Telugu Theatrical Rights Details Of Adipurush 001

ఆదిపురుష్ సినిమా గురించి చాలామంది ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా అలాగే సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు.ఓం రావత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మూవీ టీం విడుదల చేసిన ట్రైలర్ తో ఆదిపురుష్ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది . ఈ చిత్రం రామాయణం కథ ఆధారంగా అయితే రూపొందింది. ఇప్పటికే ట్రైలర్‌ చూసి అభిమానులు కూడా బాగా ఎంజాయ్ చేశారు.ఈ సినిమా ప్రభాస్‌కి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అని తెలుస్తుంది.. ‘ఆదిపురుష్’తో హిట్ కొట్టాల్సిన అవసరం కూడా ఉంది. సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. బాక్సాఫీస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలను వసూలు చేసే అవకాశం ఉంది.

మేకర్స్ ఈ చిత్రాన్ని విపరీతంగా అయితే ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్, రెండు పాటలకు అద్భుతమైన స్పందన లభించింది.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ 6 జూన్ 2023న తిరుపతిలో జరగనుంది. ఈలోగా ఆదిపురుష్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఖరారైనట్లు వార్తలు కూడా వస్తున్నాయి.
ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం.ఆదిపురుష్ సినిమా కోసం.. సుమారు 550 కోట్ల వరకూ ఖర్చు చేశారని తెలుస్తుంది.. శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్ని భాషలూ కూడా కలిపి.. దాదాపు 250 కోట్లకు పైగా అమ్మేసినట్టు సమాచారం.మరోవైపు ఏపీ, తెలంగాణ థియేటరికల్ రైట్స్ 185 కోట్ల వరకు జరిగింది. ఓవర్సీస్, హిందీ, ఇతర భాషల్లో లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా నిర్మాతలే విడుదల చేస్తున్నారని తెలుస్తుంది…
పాన్ ఇండియా రేంజ్ లో ఆదిపురుష్ సినిమా విడుదలవుతోంది. కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారని సమాచారం.. అన్ని రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్‌ అయితే వస్తుందని అంచనా వేస్తున్నారు.

Exit mobile version