Rathnam Twitter Review : ఆ మాస్ కాంబో హాట్రిక్ కొట్టినట్లేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో వచ్చ్హిన లేటెస్ట్ మూవీ “రత్నం”.ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో ఇదివరకే పూజ ,భరణి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి.ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రత్నం మూవీ హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కింది.. జీ స్టూడియోస్ మరియు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు.ఇదిలా ఉంటే హీరో విశాల్ కు తెలుగులో కూడా మాస్ ఫాలోయింగ్ వుంది.రత్నం మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేసారు.ఈ మూవీని తెలుగులో శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద సీహెచ్ సతీష్ కుమార్ మరియు కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ మరియు ట్రైలర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు.దేవిశ్రీ , విశాల్ కాంబోలో వస్తున్నా మొదటి మూవీ కావడంతో “రత్నం” సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి .దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఏప్రిల్ 26న అంటే నేడు ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పడిన పలు ప్రీమియర్ షోలు చూసిన నెటిజన్స్ రత్నం మూవీపై సోషల్ మీడియా వేదికగా రత్నంపై రివ్యూలు ఇస్తున్నారు.
సినిమాలో పాటలు సూపర్ గా ఉన్నాయి. ఎమోషన్స్ కూడా అదిరిపోయాయి. స్క్రీన్‌ప్లే మరింత అదిరిపోయింది. విశాల్ నటించిన సినిమాల్లో ఇది కూడా ఒక వందశాతం బెస్ట్ సినిమా. రత్నం బాగుంది” అనే మీనింగ్ వచ్చేలా ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు .రత్నం సినిమాలో అదిరిపోయే యాక్షన్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఉందని కొందరు నెటిజన్స్ రివ్యూలు ఇస్తున్నారు.ఈ సినిమాలో విశాల్ నటన అదిరిపోయిందని అంటున్నారు. ఫస్టాఫ్‌లో విశాల్ ఇంట్రో సీన్స్ అలాగే ప్రియా భవానీ శంకర్ మధ్య ఎమోషన్స్ అదిరిపోయాయట .
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
ఈ సినిమాలో గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగిబాబు మరియు మురళీ శర్మ తమ పాత్రల్లో అద్భుతంగా నటించినట్లు నెటిజన్స్ రివ్యూలు ఇస్తున్నారు.అయితే ఈ సినిమాలో ప్రేక్షకుడు విజిల్స్ వేసి ఇంటెన్సివ్ గా చూసే సీన్స్ అంతగా లేకపోవడంతో ప్రేక్షకులు కాస్త నిరాశకు గురైనట్లు సమాచారం .దీనితో రత్నం సినిమా లాజిక్ లెస్ యాక్షన్ డ్రామాగా నిలిచిందని తెలుస్తుంది. మొత్తానికి భారీ యాక్షన్ సినిమాగా వచ్చిన రత్నం ఒక సిల్లీ డ్రామా అయిపోయిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే, విశాల్ అభిమానులకు మాత్రం ఈ సినిమా నచ్చుతుందని అంటున్నారు.అయితే ప్రేక్షకులు ఆశించిన రేంజ్ లో ఈ సినిమా లేదని రివ్యూలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!