Pavitra : త్రినయని సీరియల్ నటి పవిత్రా జయరాం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్పించిన ఆమె సడన్ గా చనిపోవడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు.కర్ణాటకు చెందిన పవిత్ర తెలుగు సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.మే 12వ తేదీ ఆమె తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి (బి) గ్రామం వద్ద పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో పవిత్ర అక్కడికక్కడే మరణించారు .అలాగే కారులో వున్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు.ఇదిలా ఉంటే పవిత్ర మరణం గురించి ఆమె భర్త చంద్రకాంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు.ఆమె మృతికి రోడ్డు ప్రమాదం కారణం కాదని పవిత్ర మరణానికి సంబంధించి అసలు కారణాలు బయటపెట్టారు.
రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కారులో తాను, పవిత్ర, ఆమె కూతురు అలాగే మరో అమ్మాయి ఉన్నట్లుగా చంద్రకాంత్ తెలిపారు. డ్రైవర్ ఉండటంతో తాను ఆ సమయంలో పడుకున్నట్లు చంద్రకాంత్ తెలిపారు.అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఓ ఆర్టీసీ బస్సు ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ చేయగా ఈ క్రమంలో డ్రైవర్ కారును కుడివైపుకు తిప్పడంతో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. అప్పుడు కారు ముందు అద్దం పగిలిందని కారులో తనకు తప్ప ఎవరికి గాయాలు కాలేదని చంద్రకాంత్ తెలిపారు.ఇదంతా చూసి షాక్ కు గురైన పవిత్రకు స్ట్రోక్ వచ్చింది.వెంటనే అంబులెన్సు కు కాల్ చేయగా అంబులెన్సు ఆలస్యంగా రావడంతో ఇంత ఘోరం జరిగినట్లు చంద్రకాంత్ తెలిపారు.ఆ సమయంలో తనకి తగిలిన దెబ్బ కారణంగా స్పృహ కోల్పోయినట్లు తెలిపారు.తెల్లవారుజామున 4 గంటలకు స్పృహలోకి వచ్చిన తనకి పవిత్ర చనిపోయిన విషయం తెలిసిందని చంద్రకాంత్ ఎమోషనల్ అయ్యారు.