షారుఖ్ ఖాన్.. ఈ పేరు గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో బాలీవుడ్ బాద్షా గా మారాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించాడు.ఇటీవలే ‘పఠాన్’ సినిమా తో చాలా కాలం తర్వాత హిట్ ను అందుకున్నాడు..మరి ఈ సినిమా తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ ఈసారి సౌత్ టాప్ డైరెక్టర్ అయిన అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే ఫుల్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు..జవాన్ సినిమాపై భారీ అంచనాలు కూడా వున్నాయి..ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ యాక్షన్ మూవీ హిందీలో మాత్రమే కాదు పాన్ ఇండియా వ్యాప్తం గా విడుదల అవ్వబోతుంది..జవాన్ సినిమా పఠాన్ సినిమాను మించి భారీ హిట్ అవుతుంది అని ఫ్యాన్స్ కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్స్ తో పాటు కోలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తుండడం తో హిందీతో పాటు తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. ఈ సినిమాలో దీపికా పదుకొనె అతిథి పాత్రలో నటిస్తుంది.విజయ్ సేతుపతి, ప్రియమణి, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా నుండి తాజాగా ఒక వార్త వైరల్ అయ్యింది. ఈ సినిమా ఆడియో రైట్స్ కు భారీ ధర పలికినట్టు తెలుస్తుంది.. ఈ సినిమాకు ప్రముఖ ఆడియో లేబుల్ అలాగే నిర్మాణ సంస్థ అయిన టి సిరీస్ వారు భారీ ధరకు ఆడియో రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. దాదాపు 36 కోట్ల రూపాయిలను కేవలం ఆడియో రైట్స్ కోసం వెచ్చించింది టీ సిరీస్ సంస్థ. దీనికి కారణం అనిరుధ్ ఇచ్చిన మాస్ ఆల్బమ్ అని తెలుస్తుంది.ఈ సినిమాకు అనిరుధ్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చినట్లు సమాచారం.