టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరియు టాలెంటెడ్ నటి ఈషా రెబ్బా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. ప్రస్తుతం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా జరుగుతున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ వేడుకల్లో వీరిద్దరూ కలిసి సందడి చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : AJITH KUMAR : డైరెక్టర్స్‌ని రిపీట్ చేస్తోన్న అజిత్.. ఫ్లాప్ దర్శకుడికి మరో ఛాన్స్
గత కొంతకాలంగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ ఉదయ్‌పూర్‌లో కలిసి కనిపించడంతో ఆ పుకార్లకు మరింత బలం చేకూరింది. విజయ్ వివాహానికి హాజరైన ఈ జంట, అక్కడ అత్యంత సన్నిహితంగా మెలుగుతూ కెమెరా కంటికి చిక్కారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో, ఉదయ్‌పూర్ వేదికగా మరో టాలీవుడ్ వెడ్డింగ్ ప్లాన్ అవుతోందా? అనే అనుమానాలు ఫ్యాన్స్‌లో వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తలపై అటు తరుణ్ భాస్కర్ కానీ, ఇటు ఈషా రెబ్బా కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వీరిద్దరూ కేవలం మంచి స్నేహితులని, విజయ్ దేవరకొండతో ఉన్న సాన్నిహిత్యం వల్లే ఈ పెళ్లికి హాజరయ్యారని కొందరు సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఏమైనా, వీరిద్దరి కెమిస్ట్రీ చూస్తుంటే త్వరలోనే మరో శుభవార్త వినే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి విజయ్ – రష్మికలా ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతారా లేక తమ మధ్య అలాంటిది ఏది లేదని సోషల్ మీడియా వార్తలకు చెక్ పెడతారో చూడాలి.
