Site icon NTV Telugu

Congress Presidential Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో శశిథరూర్‌.. ఆ ఇద్దరి మధ్యే పోటీ!

Shashi Tharoor

Shashi Tharoor

Congress Presidential Election: కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం జరగనున్న ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. పోటీ చేసేందుకు నామినేషన్‌ సెట్లను కూడా సేకరించారు. ఎన్నికల కోసం ఐదు సెట్ల నామినేషన్‌ పత్రాలు కావాలని పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఛైర్మన్‌ మధూసూదన్‌ మిస్త్రీని లేఖ ద్వారా కోరారు. శశిథరూర్‌ ప్రతినిధి ఒకరు ఆ సెట్లను సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో అధికారికంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగిన మొదటి నాయకుడిగా శశిథరూర్ నిలిచారు. రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను తీసుకునేందుకు నిరాకరించడంతో ఆ పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ఎన్నికలు అనివార్యమయ్యాయి.

ఈ ఎన్నికల్లో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కేరళ ఎంపీ శశిథరూర్‌ తలపడబోతున్నారు. అశోక్ గెహ్లాట్‌కు అధిష్ఠానం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్‌ నేతల్లో శశిథరూర్‌ ఒకరిగా ఉన్నారు. 20 ఏళ్లుగా గాంధీలతో పాటు సోనియా గాంధీ లేదా ఆమె కుమారుడు రాహుల్‌ వద్ద ఉన్న పదవికి పోటీ చేయాలనే ఉద్దేశాన్ని థరూర్ తొలిసారిగా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిని కావాలని కలలు కంటున్న తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు సొంత రాష్ట్రం నుంచే ఎదురుగాలి వీస్తోంది. ఆయన అంతర్జాతీయస్థాయి వ్యక్తి అని, అధ్యక్ష పదవికి పోటీ చేయకపోవడమే మంచిదని సొంతం రాష్ట్రం నేతలు హితవు చెబుతున్నారు. నిజానికి రాహుల్ గాంధీకే తిరిగి పట్టం కట్టాలంటూ చాలా రాష్ట్రాలు తీర్మానాలు కూడా చేశాయి. అయితే, అవి చెల్లబోవంటూ సీనియర్ నేత జైరాం రమేశ్ వంటివారు చెబుతున్నా పీసీసీలు మాత్రం తీర్మానం చేస్తూనే ఉన్నాయి.

5G Rollout In India: 5జీ ప్రారంభానికి డేట్ ఫిక్స్.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం

అక్టోబర్‌ 17న జరగనున్న ఎన్నికల్లో శశిథరూర్‌కు అశోక్‌ గెహ్లోట్‌పై పెద్ద సవాల్‌ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గెహ్లాట్ చాలా కాలంగా గాంధీ కుటుంబానికి విధేయుడు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు గురువారం ధ్రువీకరించారు. పార్టీ మూలాల ప్రకారం, గెహ్లాట్ గాంధీల మద్దతుతో అనధికారిక అభ్యర్థి కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అనుభవజ్ఞుడైన నాయకుడు అనేక రాజకీయ సునామీల నుంచి కూడా బయటపడ్డాడు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మధ్య పోటీ జరిగే అవకాశం ఉంది. అభ్యర్థులు సెప్టెంబర్ 30 వరకు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. ఎన్నికలు అక్టోబరు 17న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు అక్టోబరు 19న జరుగుతుంది.

ఇదిలావుండగా, గాంధీ కుటుంబానికి చెందని నేత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న సందర్భం 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు రాబోతోంది. సీతారాం కేసరి నుంచి 1998లో ఆ పార్టీ పగ్గాలను సోనియా గాంధీ స్వీకరించారు. సీతారాం కేసరి 1997లో శరద్ పవార్, రాజేశ్ పైలట్‌లను ఓడించి, ఆ పదవిని చేపట్టారు.

Exit mobile version