Site icon NTV Telugu

Thank You Dear: ఆసక్తికరంగా థాంక్యూ డియర్ టీజర్

Rekha

Rekha

మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా తోట శ్రీకాంత్ కుమార్ రచన దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం థాంక్యూ డియర్. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ముఖ్యపాత్రలో కనిపిస్తూ వీర శంకర్ , నాగ మహేష్ , రవి ప్రకాష్ , ఛత్రపతి శేఖర్ , బలగం సుజాత , సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు కీలకపాత్రలు ఈ చిత్రంలో పోషించనున్నారు. సుభాష్ ఆనంద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా పి ఎల్ కే రెడ్డి డిఓపిగా పనిచేశారు. కాగా సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ చిత్ర టీజర్ ను లాంచ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ… “రియల్ స్టార్ శ్రీహరి గారి కుటుంబం నుండి వచ్చిన ధనుష్ రఘుముద్రి హీరోగా, హెబ్బా పటేల్, రేఖా నిరోషా హీరోయిన్లుగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న థాంక్యూ డియర్ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. బాలాజీ గారు నిర్మాతగా, శ్రీకాంత్ తోట దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. శ్రీహరి గారి ఆశీర్వాదాలతో ధనుష్ భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Exit mobile version