NTV Telugu Site icon

SS Thaman : గేమ్ చేంజర్, ఓజీ సినిమాలపై థమన్ సంచలన పోస్ట్

Thaman

Thaman

SS Thaman : ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రిలీజ్ కి రానున్న మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ “ఓజి”.. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలకు కూడా మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. తన నుంచి వచ్చిన బీట్స్ అయితే అభిమానులను ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తవానికి ఓజీ నుంచి ఇటీవల పవన్ బర్త్ డే కే ఓ సాంగ్ రావాల్సి ఉంది.. కానీ అనివార్య కారణాల వల్ల రాలేదు.

మరి గేమ్ ఛేంజర్ నుంచి అయితే ప్రామిసింగ్ సెకండ్ సింగిల్ ప్రోమో మాత్రం అదరగొట్టేసింది. మరి ఈ సినిమాల తాలుకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై థమన్ సాలిడ్ ప్రామిస్ చేస్తున్నాడు. గతంలో పవన్ నటించిన భీమ్లా నాయక్ మాస్ స్కోర్ పై రిప్లై ఇస్తూ ఇదేం ఉంది ఓజి, గేమ్ ఛేంజర్ లు ఇవ్వబోయే హై వేరే లెవెల్లో ఉంటుంది. వెయిట్ చేయండి అంటున్నాడు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అలాగే ఈ డిసెంబర్ 20న గేమ్ ఛేంజర్ తో రచ్చ లేపేద్దాం అని థమన్ ప్రామిస్ చేస్తున్నాడు. దీనితో ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు.

Read Also:Astrology: సెప్టెంబర్ 30, సోమవారం దినఫలాలు

ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే సెన్సేషనల్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటిస్తున్నారు. వరుస వాయిదాల తర్వాత సినిమా షూటింగ్‌ను మళ్లీ పట్టాలెక్కించినట్లు వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, అంజలి, ఇతరులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మెగా ప్రాజెక్టు హిందీ, తమిళం, తెలుగు మూడు భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కానుంది.

ఇక పవన్ అభిమానులందరూ ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్న ఏకైక సినిమా “ఓజీ” . సుజీత్ డైరెక్షన్లో, విడుదలైన టీజర్ సినిమా మీద అంచనాలను రెట్టింపు చేశాయి. కానీ.. తర్వాత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అయిపోవడం, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోవడంతో సినిమాలకు టైమ్ ఇవ్వలేకపోతున్నాడు. ఓజీ చిత్రంలో పవన్ కల్యాణ్‍కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయారెడ్డి, ప్రకాశ్ రాజ్, హరిష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

Read Also:Modi-Kharge: మల్లికార్జున ఖర్గేకు ప్రధాని మోడీ ఫోన్.. ఏమన్నారంటే?

Show comments