Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “విధ్వంసం నుండి వికాసానికి” అనే నినాదంతో తన ప్రభుత్వ కీలక కార్యక్రమాలపై విశ్లేషణ ఇచ్చారు. ముఖ్యంగా “తల్లికి వందనం” పథకాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఇది కేవలం ఒక పథకం కాదని, ప్రతి కుటుంబానికి విద్యా భద్రతకు భరోసా అంటూ వివరించారు.
Read Also: YSRCP: “జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం” పుస్తకం విడుదల..!
తల్లికి వందనం పథకాన్ని “అమ్మఒడి” మార్గదర్శకాల ప్రకారం రూపొందించినట్టు సీఎం తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలిపారు. పథకం అమలులో ఇప్పటికే 67 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. తల్లి లేని పిల్లలకు తండ్రి లేదా లీగల్ గార్డియన్‌కు నిధులు మంజూరు చేస్తారని, అనాధ పిల్లల విషయంలో కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తల్లికి వందనం పథకానికి లబ్ధిదారుల జాబితాలు గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయని సీఎం తెలిపారు. ఈ ఏడాది అడ్మిషన్లు పూర్తయ్యాక ఒకటి తరగతి నుండి ఈ నిధులు అందిస్తామన్నారు.
Read Also: Film Industry Meeting: అమరావతిలో సీఎం చంద్రబాబుతో సినీ పెద్దల భేటీకి రంగం సిద్ధం..?!
అయితే, 2024 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రతి విద్యార్థికి గాను ప్రతి ఒక్క విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగానే మొత్తం 67,27,164 మంది విద్యార్థుల తల్లులు లేదా గార్డియన్స్ కు రూ.8,745 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం. ముఖ్యంగా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే.. ప్రతిఒక్కరికి రూ.15 వేల చొప్పున సాయం ప్రభుత్వం అందించనుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి విడుదల చేసింది. అయితే జీవోలో మాత్రం రూ.15వేలు కాకుండా రూ.13వేలు మాత్రమే ఇస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ రూ.15వేలలో పాఠశాల నిర్వహణ కోసం రూ. 1000, అలాగే మరుగుదొడ్ల నిర్వహణ నిధికి గాను రూ.1,000 చొప్పున కొత్త పెట్టి మిగిలిన రూ.13వేలు ఇచ్చేలా జిఓ విడుదల చేసింది. జంగం సర్కార్ లో తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం కూడా ఫాలో అయ్యింది.. దీనితో ప్రతి ఒక్క విద్యార్థికి రూ.13వేల చొప్పున ఇవ్వబోతోంది.
