Site icon NTV Telugu

Thalapathy Vijay: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న విజయ్..?

Vijay

Vijay

తమిళ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హీరో రజినీకాంత్ తో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఆయన సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో కూడా డిమాండ్ ఎక్కువే..దాంతో విజయ్ తమిళ్ సినిమాలను తెలుగులో కూడా తీస్తున్నారు.. అయితే హీరో విజయ్ గురించి సినిమా అప్డేట్ తో పాటు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే ఆయన త్వరలోనే ఓ ప్రముఖ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని నెట్టింట పెద్దగా ఎత్తున ప్రచారం జరుగుతుంది..

తాజాగా ఆయన రాజకీయ అరంగెట్రం గురించిన వినిపిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎలక్షన్లు లక్ష్యంగా ఆయన సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు విజయ్‌ రాజకీయ రంగలోకి అడుగుపెట్టబోతున్నట్లు నెట్టింట జోరందుకున్నాయి. పైగా ఈ మధ్యకాలంలో విజయ్‌ తమిళనాడులో పలు చోట్ల సంక్షేమ కార్యక్రమాల్లోనూ చురుగ్గాపాల్గొంటున్నారు. ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా నటుడు విజయ్ అందరికీ కేంద్రం ఆహారాన్ని అందించాలని నినాదాలు చేశారు. అంతేకాకుండా తమిళనాడులోని పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.. అంతేకాదు రాజకీయ నేతల పార్టీ కార్యక్రమాలకు, అలాగే పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటున్నారు.. దీంతో ఈ వార్తకు ఆజ్యం పోసుకుంది..

ఇది ఇలా ఉండగా.. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం నుంచి పదో తరగతి, ఇంగర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు జూన్ 17న ఘనంగా సత్కరించనున్నారు. చెన్నై నీలగిరిలోని ఆర్‌కే కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా ఈ కార్యక్రమ నిర్వహణకు పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్ధులకు బహుమతులు ప్రధానంతోపాటు, నగదు ప్రోత్సహకం కూడా అందించనున్నట్లు ఇప్పటికే విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ ప్రకటించింది కూడా. గత కొంతకాలంగా విజయ్‌ కార్యచరణ చూస్తుంటే ఆయన రాజకీయాలను కేంద్రీకృతం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.. గతంలో కూడా ఇలాంటి వార్తలు చాలానే వినిపించాయి..ఇక విజయ్‌ రాజకీయ ప్రవేశం గురించిన రావడం ఇదేం తొలిసారి కాదు. ఇవి ఎంతరకు నిజమో తేలాలంటే దళపతి మౌనం వీడాల్సిందే.. రాజకీయాల్లో సినీస్టార్స్ ఆరంగ్రేటం కొత్తేమి కాదు.. ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు..
Read Also:Amitabh Bachchan :ఫ్యాన్స్ దగ్గరకి వచ్చేటప్పుడు అమితాబ్ చెప్పులు ఎందుకు వేసుకోరో తెలుసా?

Exit mobile version