బాలివుడ్ బాద్షా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు 80 ఏళ్లు వచ్చినా కూడా సినిమాల జోరు తగ్గలేదు.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు టీవీ లో పలు రియాలిటీ షోలు చేస్తూ దూసుకుపోతున్నారు.. సినిమా పై ఆయనకు ఉన్న ఇష్టం ఆయనను ముందుకు నడిపిస్తుందని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.. ఈ జేనరేషన్ నటులకు అభితాబ్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.. అయితే తాజాగా అభితాబ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
అదేంటంటే.. అమితాబ్ ప్రతి ఆదివారం ముంబైలోని తన ఇంటి జల్సా వద్ద అభిమానులను కలుసుకుంటూ ఉంటారు. వారితో కాసేపు మాట్లాడి వారిని ఆనందపరుస్తుంటాడు. అయితే అమితాబ్ వారి దగ్గరకి వెళ్లే సమయం లో కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్తారు.. దానికి కారణం ఏంటో తాజాగా వెల్లడించారు. మనమంతా దేవుడి దగ్గరకి వెళ్ళినప్పుడు కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్తాము కదా? అలాగే తనని అభిమానించి ఇంతటి స్థాయిని అందించిన అభిమానులు తనకి దేవుళ్ల తో సమానం అని, ఆ అభిమానులు ఎక్కడ ఉంటే అది తనకి దేవాలయం అని, అందుకే తాను చెప్పులు ధరించానని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలియడంతో అమితాబ్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..
ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. అమితాబ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా రాబోతుంది. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో అమితాబ్ కి గాయం అవ్వడం తో.. ఈ మూవీ షూటింగ్ కొంత బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమాలో దీపికా, దిశా పటాని, ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కమల్ హాసన్ కూడా ఈ సినిమా లో ఒక పాత్ర చేస్తున్నాడని ఇటీవల వార్తలు వినిపించాయి. మరి అందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది..