NTV Telugu Site icon

Ind vs NZ: భారత బౌలర్ల విజృంభణ, కష్టాల్లో కివీస్.. 15 పరుగులకే 5 వికెట్లు

Ind Vs Nz

Ind Vs Nz

Ind vs NZ 2nd Odi: భారత బౌలర్ల విజృంభించడంతో కివీస్ చిక్కుల్లో పడింది. 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. రాయ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండే వన్డే మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తర్వాత బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ కివీస్ ఆటగాళ్లపై బుల్లెట్ల లాంటి బంతులతో విరుచుకుపడ్డారు. ఫిన్‌ అలెన్‌, డారిల్‌ మిచెల్‌, హెన్రీ నికోలస్‌ లాంటి కీలక ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోరు మాత్రమే చేయగలిగారు.

Jammu Kashmir : బాంబు పేలుళ్లతో ఉలిక్కి పడ్డ జమ్ముకశ్మీర్

షమీ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, హార్దిక్ పాండ్యా, శార్దూల్ తలో వికెట్ తీయగలిగారు. ప్రస్తుతం న్యూజిలాండ్ ఆటగాళ్లు గ్లెన్‌ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్ వెల్ క్రీజులో ఉన్నారు. సిరీస్ మొదటి వన్డేలో భారత్ తన ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి 2-0 ఆధిక్యంతో తిరుగులేకుండా నిలవాలని చూస్తోంది. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ క్రికెట్ స్టేడియం తొలిసారిగా అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. తొలి వన్డేలో శుభ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ సాధించి భారత్‌ విజయానికి పునాది వేశాడు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత, గిల్ 208 పరుగులతో భారత్ 349/8 భారీ స్కోరును నమోదు చేసింది. అనంతరం ఛేజింగ్‌లో మైకేల్ బ్రేస్‌వెల్ వేగవంతమైన సెంచరీ (140) కారణంగా న్యూజిలాండ్ లక్ష్యానికి చేరువైంది. కానీ ఎట్టకేలకు భారత్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.