TGSRTC Driver Death: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC Driver Shankar Goud Dies: నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అపోలో ఆస్పత్రిలో శంకర్ గౌడ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. బంధువులకు శంకర్ గౌడ్ మృతదేహాన్ని అప్పగించారు. స్వస్థలానికి శంకర్ గౌడ్ మృతదేహం తరలిస్తున్నారు. నిన్న ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్న విషయం తెలిసిందే. గత రెండ్రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ సమ్మెలో భాగంగా గురువారం రాష్ట్రంలోని అనేక చోట్ల కార్మికులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సమ్మెలో పాల్గొన్న శంకర్‌గౌడ్(55) పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయనను వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 80 శాతం కాలినగాయాలు కావడంతో హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు. ఈ రోజు అత్యక్రియలు జరగనున్నాయి. ప్రముఖ రాజయకీయ నాయకులు హాజరుకానున్నారు.
READ MORE: Iran Prince Reza Pahlavi: ఇరాన్ బహిష్కృత నేత రెజా పహ్లవిపై దాడి.. వీడియో వైరల్
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
మరోవైపు.. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దు:ఖసాగరంలో ముంచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుందని గుర్తు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దని క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!