NTV Telugu Site icon

Results: నేడు గ్రూప్-2 ఫలితాలు.. కాసేపట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటన

Tgpsc

Tgpsc

నేడు గ్రూప్-2 ఫలితాలు విడుదల కానున్నాయి. మరికాసేపట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను టీజీపీఎస్సీ (TGPSC) ప్రకటించనుంది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తో పాటు ఫైనల్ ‘కీ’ ని కూడా విడుదల చేయనుంది. అలాగే.. టాపర్స్ లిస్ట్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. కాగా.. గ్రూప్-2లో మొత్తం 783 పోస్ట్‌ల భర్తీకి 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో.. గ్రూప్- 2 పరీక్షకు 5 లక్షల 51 వేల 855 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఈ పరీక్ష పలుమార్లు వాయిదా పడగా.. గత డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 2 లక్షల 51 వేల 738 (45.57 శాతం) మంది హాజరు అయ్యారు. ఈ క్రమంలో.. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేస్తుంది టీజీపీఎస్సీ.

Read Also: Nidhhi Agerwal : నిధులున్నా కూడా ఆఫర్లు అంతంత మాత్రమే

కాగా.. సోమవారం గ్రూప్‌-1 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా మొత్తం 563 ఖాళీలను భర్తీ చేశారు. గతంలో నిర్వహించిన ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను అధిగమించిన అభ్యర్థుల తుది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అలాగే 1,363 గ్రూప్-3 పోస్టుల‌కు భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో 1,401 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. కాగా.. మార్చి 14వ తేదీన‌ గ్రూప్-3 ఫలితాలు విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

Read Also: Job Resignation: చేరిన 10 రోజుల్లోనే రూ.21లక్షల ఉద్యోగాన్ని వదిలేసిన ఐఐఎమ్ గ్రాడ్యుయేట్.. కారణమేంటంటే?