TG20 League: 4,6,6,4,6,6 బ్యాటింగ్ విధ్వంసం.. 32 బంతుల్లో సెంచరీ..

Waman

Waman

టీజీ20 లీగ్‌ 2026 సీజన్‌లో వరంగల్ వారియర్స్ కెప్టెన్, ఓపెనర్ అమన్‌రావు పేరాల సరికొత్త చరిత్ర సృష్టించాడు. మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, ఈ టోర్నీ చరిత్రలోనే తొలి శతకాన్ని నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. మైదానంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డ అమన్, మొత్తం 48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 142 పరుగుల మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అమన్‌రావు కేవలం 17 బంతుల్లోనే అర్ధశతకాన్ని అందుకున్నాడు.

ముఖ్యంగా సయ్యద్ ఘాజీ అబ్బాస్ వేసిన ఒకే ఓవర్‌లో 4, 6, 6, 4, 6, 6 బాది ఏకంగా 32 పరుగులు పిండుకోవడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. తిలక్ వర్మ, రవితేజ, సూర్యతేజల బౌలింగ్‌ను సైతం చీల్చిచెండాడుతూ సాయి వరుణ్ ఓవర్‌లో ఫోర్‌తో సెంచరీ మార్క్‌ను దాటాడు. చివరకు 14.3 ఓవర్‌లో రాహుల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అమన్‌రావుకు తోడుగా ఓపెనర్ హర్షిత్ చౌదరి (35), అభిషేక్ (32), రిషికేత్ (25) రాణించడంతో వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోరు సాధించింది. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ, మధుకర్ రెండేసి వికెట్లు పడగొట్టగా, సూర్యతేజ, రవితేజ, రాహుల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

×
×
Ad