TG20 League: 4,6,6,4,6,6 బ్యాటింగ్ విధ్వంసం.. 32 బంతుల్లో సెంచరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీజీ20 లీగ్ 2026 సీజన్లో వరంగల్ వారియర్స్ కెప్టెన్, ఓపెనర్ అమన్‌రావు పేరాల సరికొత్త చరిత్ర సృష్టించాడు. మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, ఈ టోర్నీ చరిత్రలోనే తొలి శతకాన్ని నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. మైదానంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డ అమన్, మొత్తం 48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 142 పరుగుల మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అమన్‌రావు కేవలం 17 బంతుల్లోనే అర్ధశతకాన్ని అందుకున్నాడు.
ముఖ్యంగా సయ్యద్ ఘాజీ అబ్బాస్ వేసిన ఒకే ఓవర్లో 4, 6, 6, 4, 6, 6 బాది ఏకంగా 32 పరుగులు పిండుకోవడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. తిలక్ వర్మ, రవితేజ, సూర్యతేజల బౌలింగ్‌ను సైతం చీల్చిచెండాడుతూ సాయి వరుణ్ ఓవర్లో ఫోర్‌తో సెంచరీ మార్క్‌ను దాటాడు. చివరకు 14.3 ఓవర్లో రాహుల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అమన్‌రావుకు తోడుగా ఓపెనర్ హర్షిత్ చౌదరి (35), అభిషేక్ (32), రిషికేత్ (25) రాణించడంతో వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోరు సాధించింది. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ, మధుకర్ రెండేసి వికెట్లు పడగొట్టగా, సూర్యతేజ, రవితేజ, రాహుల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
తాజావార్తలు
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!