టాలీవుడ్‌లో సినిమా బడ్జేట్ రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. కనీస లాభాలు కూడా సాధించలేని సినిమాలకు కూడా పిచ్చి పిచ్చిగా ఖర్చు చేస్తూ నిర్మాతలను నష్టంలో తోసేస్తున్నారు. ఇక పాన్ ఇండియా సినిమాల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. అంతకంత పెంచుకుంటూ పోతున్నారు తప్ప తగ్గించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన తాజా వ్యాఖ్యలు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.
Also Read : Sangeetha : మొత్తానికి విడాకుల ప్రచారంపై స్పందించిన.. హీరోయిన్
‘మలయాళంలో కేవలం కోటి రూపాయల బడ్జెట్‌తో రూపొందించదగిన సినిమా, తెలుగులో తీయాలంటే దాదాపు రూ.15 కోట్లు ఖర్చు అవుతుంది. నిజానికి మలయాళం నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటానికి కారణాలు చాలానే ఉన్నాయి. అక్కడ నటీనటులు, టెక్నీషియన్లు తక్కువ పారితోషికంతో పనిచేస్తారు. కానీ తెలుగులో మాత్రం చాలా ఖర్చవుతుంది. పెద్ద రెమ్యునరేషన్లు, భారీగా వేతనాలు, స్పాట్ వర్కర్ల కోసం అదనపు ఖర్చులు అన్నీ కలిపి బడ్జెట్ దెబ్బతింటుంది. ఈ పరిస్థితిని మార్చాలంటే పారితోషికాలకు ఒక నిబంధన అవసరమం. పరిశ్రమలో రెమ్యునరేషన్లు నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి ఓపెన్ డిస్కషన్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్వహించాలి, ఎందుకంటే కొత్త నిర్మాతలు రావాలంటే ఖర్చు పై భయపడకూడదు’ అని ఆయన పేర్కొన్నారు. ఇక విశ్వప్రసాద్ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు, ఈ విషయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నారు.. ‘ఇది నిజం, ఖర్చులు బాగా పెరిగిపోయాయి’ అని అంటున్నారు. మరికొందరేమో ‘ఇది ప్రతి కథకు వర్తించదు.. టాలెంట్‌ను బట్టి, ప్రొడక్షన్ స్కేల్‌ను బట్టి ఖర్చు మారుతుంది’ అని వ్యతిరేకిస్తున్నారు.
