NTV Telugu Site icon

TG TET 2024: టెట్ అభ్యర్థులకు అలర్ట్‌.. అప్లికేషన్ ఎడిట్‌కు అవకాశం

Ts Tet

Ts Tet

TG TET 2024: తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు అప్లికేషన్ లోని తప్పులను సవరిస్తేను అవకాశం కల్పించింది. టెట్ నోటిఫికేషన్‌ గతంలో విడుదల చేయగా, దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అభ్యర్థులు తమ అప్లికేషన్లలో జరిగే తప్పులను సరిదిద్దుకునేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కొత్త అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు.

SSC Exam Fee : పదవ తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

ఈ సవరణ ప్రక్రియ www.schooledu.telangana.gov.in అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా చేయవచ్చు. అదనపు సమాచారానికి, అభ్యర్థులు 7032901383, 9000756178 నంబర్లను సంప్రదించవచ్చు. ఇక, దరఖాస్తుల ఆఖరి తేదీ ఈ నెల 20గా నిర్ణయించబడింది. గత మే నెలలో టెట్ పరీక్షకు హాజరై ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. జనవరి 1 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించబడనుండగా, ఫిబ్రవరి 5న ఫలితాలు ప్రకటించబడతాయని నోటిఫికేషన్‌లో తెలియజేసింది.

TG SET 2024 : టీజీ సెట్ 2024 ఫలితాలు విడుదల