Site icon NTV Telugu

TG Polycet Results 2024: పాలిసెట్ ఫలితాలు విడుదల

Polycet

Polycet

TG Polycet Results 2024: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ పాలిసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పాలిసెట్ పరీక్షను మే 24న నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా 82, 809 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫిషరీస్‌, హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారన్న సంగతి తెలిసిందే.

ఫలితాల కోసం.. ఈ లింక్ క్లిక్ చేయండి.

TS Polycet 2024 ఫలితాలను ఎలా తెలుసుకోవాలంటే?
దశ 1. polycet.sbtet.telangana.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
దశ 2. హోమ్‌పేజీలో, TS POLYCET 2024 ర్యాంక్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి
దశ 3. మీరు కొత్త వెబ్‌సైట్‌కి దారి మళ్లించబడతారు, ఫలితాన్ని తనిఖీ చేయడానికి మీ హాల్ టిక్కెట్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
దశ 4. మీ TS POLYCET ఫలితం 2024 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది
దశ 5. భవిష్యత్తు సూచన కోసం డౌన్‌లోడ్ చేసి, దాని ప్రింట్‌అవుట్‌ని తీసుకోండి

Exit mobile version