TG: టీజీ లాసెట్, పీజీ ఎల్సెట్ షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ ఎప్పుడంటే..?
- టీజీ లాసెట్, పీజీ ఎల్సెట్, టీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదల
- జూన్ 6న టీజీ లాసెట్, పీజీ ఎల్సెట్ ప్రవేశ పరీక్ష
- మే 12న టీజీ ఈసెట్ పరీక్ష.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లా కోర్సుల్లో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన చేసింది. లాసెట్, పీజీ ఎల్సెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ను శనివారం విడుదల చేసింది. ఫిబ్రవరి 25న నోటిఫికేషన్, మార్చి 1 నుంచి మే 25వ తేదీ వరకు లేట్ ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. అలాగే.. జూన్ 6న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు.
* టీజీ లాసెట్, పీజీ ఎల్సెట్ షెడ్యూల్:
* నోటిఫికేషన్ ఫిబ్రవరి 25, 2025.
* ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం మార్చి 1, 2025.
* ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 15, 2025
* ఆలస్య రుసుముతో మే 25, 2025
* పరీక్ష తేదీ జూన్ 6, 2025
* కోర్సులు: మూడు, ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సులు, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సు.
* అర్హత- మూడేళ్ల ఎల్ఎల్బి కోర్సుల్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. ఎల్ఎల్ఎం చేయాలనుకునే వారు డిగ్రీతోపాటు ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
* మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://lawcetadm.tsche.ac.in/ను సంప్రదించండి.
Also Read

మరోవైపు.. టీజీ ఈసెట్ (TG ECET 2025) షెడ్యూల్ కూడా విడుదలైంది. టీజీ ఈసెట్ అనేది తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించే రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష. ఇది తెలంగాణలో డిప్లొమా హోల్డర్లు మరియు B.Sc. (గణితం) డిగ్రీ హోల్డర్లకు B.Tech/BE, B.Pharmacy కోర్సుల రెండవ సంవత్సరంలో ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది.
టీజీ ఈసెట్ షెడ్యూల్:
నోటిఫికేషన్ తేదీ ఫిబ్రవరి 25, 2025.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం మార్చి 3, 2025.
ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ.. ఆలస్య రుసుముతో తేదీ ఏప్రిల్ 19, 2025
పరీక్ష తేదీ: మే 12, 2025

తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..