Anji Reddy Chinnamile: ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి.. 100 రోజుల యాక్షన్ ప్లాన్..
- కరీంనగర్లో పట్టభద్రుల సంకల్ప యాత్ర..
- ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి చిన్నమైల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anji Reddy Chinnamile: తెలంగాణలో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీల్లో ప్రచారాన్ని ఉధృతం చేశారు ఆయా పార్టీల అభ్యర్థులు.. ఉమ్మడి కరీంనగర్ – ఆదిలాబాద్ – మెదక్ – నిజామాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ అంజి రెడ్డి చిన్నమైల్ .. ఓవైపు ప్రచారం నిర్వహిస్తూనే.. మరోవైపు.. తాను గెలిస్తే ఏం చేస్తాను అనే దానిపై క్లారిటీతో వస్తున్నారు.. దానికి అనుగుణంగా.. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు అంజిరెడ్డి.. ‘విద్య, ఉపాధి, సంక్షేమం’ గ్రాడ్యుయేట్లకు అంజిరెడ్డి భరోసా పేరుతో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మేనిఫెస్టో – 2025 రిలీజ్ చేశారు.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత జోరుమీదున్న బీజేపీ.. ఆ ప్రభావం స్థానిక ఎన్నికల్లో కూడా కలిసివస్తోందని ఆశిస్తోంది.. బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డికి మద్దతుగా కరీంనగర్లో నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప యాత్రకు బీజేపీ అగ్ర నేతలు విచ్చేసి అంజిరెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.. 5 జీ కాలంలో కాంగ్రెస్ 3జీకి పరిమితమైందంటూ సెటైర్లు వేశారు.. రైతు డిక్లరేషన్, యూత్ డెకరేషన్, గ్యారంటీలు, హామీలు తుంగలో తొక్కిందని మండిపడ్డారు..
Read Also: Ms.ilayaa : మొదలైన “మిస్ ఇళయా”!
Also Read
- Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి చిన్నమైల్ తన ఎన్నికల మేనిఫెస్టోను పట్టభద్రుల సంకల్ప యాత్రలో ఆవిష్కరించారు.. తన గెలుపు పై ధీమా వ్యక్తం చేశారు.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఘాటుగా విమర్శలు గుప్పించారు..
* గ్రాడ్యుయేట్ల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నా.. విద్యార్థులు – ప్రభుత్వ ఉద్యోగార్థులకు చేయూత ఇస్తా..
* స్వయం ఉపాధి – ఉద్యోగ అవకాశాల కల్పన.. ఉద్యోగ భద్రత – నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యం..
* గ్రాడ్యుయేట్ల సంక్షేమం మరియి భద్రతకుకు పెద్దపీట.. ప్రతి పట్టభద్రుడి సామాజిక భద్రతకు హామీ
* ఉపాధ్యాయుల సంక్షేమం, ఉద్యోగుల హక్కులకై పోరాటం.. సమస్యల పరిష్కారానికి పోరాటం చేసేందుకు ప్రాధాన్యం..
* న్యాయవాదుల సంక్షేమానికి కృషి.. వారి సంక్షేమం, అభ్యున్నతికి ప్రోత్సాహం.
* వైద్య రంగ అభివృద్ధి – డాక్టర్ల సంక్షేమానికి హామీ.. ఆరోగ్య రంగ అభ్యున్నతి ప్రజారోగ్యానికి గ్యారంటీ.. లాంటి అంశాలను తన మేనిఫెస్టోలో పొందుపరిచారు..
ఇక, ఎన్నికైన వెంటనే 100 రోజుల యాక్షన్ ప్లాన్.. మేనిఫెస్టో అమలుకై పారదర్శక కార్యాచరణ.. ప్రజాభాగస్వాత్యంతో – ప్రజావేదిక నిర్వహణ అని.. హామీ ఇచ్చారు ఉమ్మడి కరీంనగర్ – ఆదిలాబాద్ – మెదక్ – నిజామాబాద్ పట్టభద్రుల స్థానం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి చిన్నమైల్..
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..