NTV Telugu Site icon

TG ICET: టీజీ ఐసెట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు..

Tg Icet

Tg Icet

తెలంగాణ ఐసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు అయ్యాయి. త్వరలో MBA, MCA కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. TG ICET ర్యాంకుల ఆధారంగా ప్రవేశాల కోసం TGCHE కేంద్రీకృత కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తుంది. కాగా.. సెప్టెంబర్ ఒకటి నుండి ఐసెట్(MBA, MCA కోర్సుల్లో) అడ్మిషన్స్ కౌన్సెలింగ్ ఉండనుంది. సెప్టెంబర్ 14 న మొదటి విడత సీట్ల కేటాయింపు.. సెప్టెంబర్ 20 నుండి తుది విడత కౌన్సిలింగ్, సెప్టెంబర్ 25న తుది విడత సీట్ల కేటాయింపు, సెప్టెంబర్ 27న స్పాట్ అడ్మిషన్స్ ఉండనున్నట్లు టీజీఐసెట్ 2024 అడ్మిషన్స్ కమిటీ సమావేశంలో తెలిపారు.

Read Also: UP: వరకట్న హత్య కేసులో భర్త, అత్తమామలకు జీవిత ఖైదు

ఈ ఏడాది తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం 86,514 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో సుమారు 77942 మంది అభ్యర్థులు రెండు రోజుల పాటు TG ICET 2024 పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ MBA కేంద్రీకృత కౌన్సెలింగ్ ప్రక్రియకు ప్రాథమిక అర్హత షరతుకు అనుగుణంగా 71,647 మంది ఉత్తీర్ణులయ్యారు. టీజీ ఐసెట్‌ 2024 పరీక్షలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 116 పరీక్షా కేంద్రాలలో జూన్‌ 5, 6 తేదీల్లో నిర్వహించారు.

Whatsapp Image 2024 08 24 At 5.26.01 Pm

Read Also: Vande Bharat Sleeper: త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభమెప్పుడంటే..?