NTV Telugu Site icon

TS TET Results : విడుదలైన టెట్ ఫలితాలు.. క్వాలిఫైడ్ అభ్యర్థుల శాతం ఎంతంటే..?

Ts Tet

Ts Tet

Education: అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ టెట్ ఫలితాలు ఈ రోజు ఉదయం విడుదలైయ్యాయి. ఈ రోజు ఉద్యమ 10 గంటలకి టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి టెట్ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు https://tstet2023results.cgg.gov.in/tstet2023pkgr1510.results వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. కాగా ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో టెట్‌ పరీక్ష నిర్వహించిన విషయం అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా పేపర్‌-1కు 2.26 లక్షలు(84.12శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్‌-2కు 1.90 లక్షల మంది (91.11 శాతం) హాజరయ్యారు. పేపర్ వన్ కు హాజరైన అభ్యర్థుల్లో 36.89 శాతం మంది అర్హత సాధించగా.. పేపర్ 2 మాథ్స్ ,సైన్స్ లో 18.66 శాతం , సోషల్ స్టడీస్ లో 11.47 శాతం మంది అర్హత సాధించారు.

Read also:Brave Constable : రైల్వే ట్రాక్ పై భార్యపై బ్లేడుతో దాడిచేసిన భర్త.. కాపాడిన కానిస్టేబుల్

కాగా టెట్ సర్టిఫికెట్ కాల పరిమితి జీవితాంతం ఉంటుంది. కాగా డీఎస్సీ మార్కుల్లో.. అభ్యర్థులు టెట్ లో సాధించిన 20 మార్కులను వెయిటేజీ ఇస్తారు. టెట్‌ పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్‌ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. కాగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. నవంబర్ 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో డీఎస్సీ కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ నెల 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.