SP Leader: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫూల్ సింగ్ బరయ్యా అత్యాచార కేసులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలతో సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఎస్టీ హసన్ విభేదించారు. ఇలాంటి సంఘటనలకు మద్యం సేవించడమే కారణమని ఆయన అన్నారు. అత్యాచారాలను అడ్డుకునేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని చౌరస్తాలో కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. మద్యం తాగిన తర్వాత ఒక వ్యక్తికి భార్య, కుమార్తె మధ్య తేడాను మరిచిపోతాడని, ఇలాంటి ఉదాహరణలు మనం చాలానే చూశామని అన్నారు.
Read Also: PM Modi: ‘‘మహా జంగిల్ రాజ్’’.. మమతా బెనర్జీ పాలనపై ప్రధాని మోడీ ఫైర్..
ఇంటర్నెట్లో అశ్లీల కంటెంట్ కూడా అత్యాచారాలకు కారణమవుతున్నాయని, ఇది యువకుల్లో ‘‘టెస్టోస్టెరాన్’’ను పెంచుతుందని, వారి లైంగిక కోరికలను నియంత్రించుకోవడం వారికి కష్టతరం చేస్తుందని అన్నారు. అత్యాచార కేసుల కారణాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫూల్ సింగ్ బరయ్యా చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా హసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో బరయ్యా మాట్లాడుతూ.. అందమైన అమ్మాయిని చూసిన వ్యక్తి మనసు తప్పి లైంగిక దాడికి పాల్పడవచ్చని అన్నారు.